
కోవిడ్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ దేశంలో కేంద్రం సడన్‌గా లాక్‌డౌన్ ని విధించింది. ఈ నేపథ్యంలో వలస జీవుల బాధ అరణ్యరోదనగా మారింది. ఎలాంటి సపోర్ట్ లేకుండా కాలి నడకన మైళ్ల దూరం ప్రయాణిస్తూ గమ్యస్థానాలకి చేరుకోవాలని నడక ప్రారంభించిన వారికి నేనున్నానంటూ అండగా నిలిచారు నటుడు సోను సూద్. బస్సులు, ట్రైన్‌లు చివరికి విమానాలని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వలస కార్మికులని వారి వారి గమ్యస్థానాలకు చేర్చారు.
దీంతో ఆయన దేశ వ్యాప్తంగా రియల్ హీరో అయ్యారు. ఇదిలా వుంటే తాజాగా ఆయనని కూడా కోవిడ్ వదలలేదు. దీంతో ఆయన గత కొన్ని రోజులుగా స్వీయ నిర్భంధంలో వుంటున్నారు. తనకు కోవిడ్ సోకినా ఓ కోవిడ్ పేషెంట్ కోసం సోను సాహసం చేశారు. స్వీయ నిర్భంధంలో వుంటూనే భారతి అనే 25 ఏళ్ల యువతి కోసం ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్స్‌ని ఏర్పాటు చేసి మరోసారి తను రియల్ హీరో అనిపించుకున్నారు.
భారతి అనే యువతికి కోవిడ్ పోకడంతో ఆమె ఊపిరి తిత్తులు 85 నుంచి 90 శాతం పడై పోయాయి. ఇది గమనించిన సోనుసూద్ ఆమెని నాగ్‌పూర్‌లోని వోక్ హార్ట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారు ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని తేల్చిడంతో వెంటనే సోను హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్ డాక్టర్లని సంప్రదించారు. వారు ECMO అనే పద్దతి ద్వారా చికిత్స అందించవచ్చిన అయితే 20 శాతం మాత్రం హోప్ వుందని చెప్పడంతో భారతి అనే యువతిని ప్రత్యేక ఏయిర్ అంబులెన్స్ విమానంలో నాగ్ పూర్ నుంచి హైదరాబాద్‌కి తరలించారు. ఇలా ఓ పేషెంట్ కోసం ప్రత్యేకంగా విమానాన్ని ఏర్పాటు చేయించి సోనుసూద్ మరోసారి తన గొప్ప మనసుని చాటు కోవడంతో సర్వత్రా ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రిటైర్డ్ రైల్వే అధికారి కూతురైన భారతి కోలుకుంటుందని, క్షేమంగా తిరిగి వస్తుందని సోనుసూద్ ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.