Homeటాప్ స్టోరీస్మొన్న ఫ్లైట్‌.. ఇప్పుడు రైళ్లు..!

మొన్న ఫ్లైట్‌.. ఇప్పుడు రైళ్లు..!

మొన్న ఫ్లైట్‌.. ఇప్పుడు రైళ్లు..!
మొన్న ఫ్లైట్‌.. ఇప్పుడు రైళ్లు..!

క‌రోనా కార‌ణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించ‌డంతో అంద‌రిని మించి ఇబ్బందుల‌కు గురౌతున్న వ‌ర్గం వ‌ల‌స కూలీలు. లాక్‌డౌన్ కార‌ణంగా బ‌స్సులు, రైళ్లు బంద్ కావ‌డంతో కాలిన‌డ‌క‌న ల‌క్ష‌లాది మంది ఇంటిదారి ప‌ట్టారు. మైళ్ల దూరం కాలిన‌డ‌క‌నే వెళ్లి ఇళ్ల‌కు చేరుతున్నారు. కొంత మంది మార్గ మ‌ద్యంలోనే క‌న్ను మూస్తున్నారు.

వీరి వెత‌లు చూడ‌లేని చాలా మంది ముందుకొచ్చి వారిని ఇంటికి క్షేమంగా పంపించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఏర్పాట్ల‌లో ప్ర‌ప్ర‌ధ‌మంగా వినిపిస్తున్న పేరు సోనూసూద్‌  గ‌త కొన్ని రోజులుగా వ‌ల‌స కూలీల కోసం త‌న వంతు బాధ్య‌త‌గా శ్ర‌మిస్తూనే వున్నారాయ‌ణన. ఇటీవ‌లే కొంత మంది కోసం బ‌స్సులు ఏర్పాటు చేసిన ఆయ‌న భువ‌నేశ్వ‌ర్‌కు చెందిన మ‌హిళా కార్మికుల కోసం ఏకంగా ఫ్లైట్‌నే ఏర్పాటు చేసి వారిని క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర్చ‌డం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

- Advertisement -

తాజాగా కేంద్రం లాక్‌డౌన్‌లో స‌వ‌రింపులు ఇవ్వ‌డంతో వ‌ల‌స కూలీల కోసం ‌రైళ్ల‌ని బుక్ చేస్తున్నాడు సోనూసూద్‌. త‌మ ఇళ్ల‌కు వెళ్లాల‌నుకునే కార్మికులు టోల్ ఫ్రీ నంబ‌ర్‌కు ఫోన్ చేయాల‌ని ఓ నంబ‌ర్‌ని సోష‌ల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్ ద్వారా పంచుకున్నారు. బ‌స్సులు ఏర్పాటు చేసి ముంబై నుంచి క‌ర్ణాట‌క‌కు పంపించడంతో ఆ రోజు నుంచి ఈ త‌ర‌హా విజ్ఞ‌ప్తలు ఎక్కువ‌య్యాయిని, విప‌రీతంగా ఫోన్ కాల్స్ రావ‌డంతో కొన్ని కాల్స్ అటెండ్ చేయ‌లేక‌పోయాన‌ని, అందుకే టోల్ ఫ్రీ నంబ‌ర్‌ని ఏర్పాటు చేశాన‌ని సోనూసూద్ ఈ సంద‌ర్భంగా చెప్పారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All