
నిక్కీ తంబోలి. `చీకటి గదిలో చిలక్కొట్టుడు` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. తొలి చిత్రంతో అందాల ఆరబోత విషయంలో ఎలాంటి పొదుపుని పాటించని ఈ హాట్ బ్యూటీ తమిళంలోకి రాఘవ లారెన్స్ నటించి తెరకెక్కించిన `కాంచన 3`తో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో`తిప్పరా మీసం`లోనూ నటించింది కానీ ఆశించిన స్థాయిలో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్‌ని ఆకట్టుకోలేకపోయింది.
చేతిలో సినిమాలు లేకపోవడం, హాట్ బ్యూటీ ఇమేజ్ వుండటంతో నిక్కీ తంబోలీకి ఓ బంపర్ ఆఫర్ లభించింది. అదే బిగ్‌బాస్. సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సీజన్ 14లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ సాధించేసింది. ఈ నెల 3 నుంచి సీజన్ 14 ప్రారంభమైంది. హాట్ కంటెస్టెంట్‌గా బరిలోకి దిగిన నిక్కీ తంబోలీ సహ కంటెస్టెంట్ సిద్ధార్ధ్ శుక్లాతో కలిసి రచ్చ చేస్తోంది. వీరిద్దరు కలిసి చేసిన రెయిన్ డ్యాన్స్‌లో కెమిస్ట్రీ పీక్స్‌కి వెళ్లిపోయింది.
ఇదిలా వుంటే నిక్కీని ఒళ్లంతా తడిమేస్తూ ఓ కంటెస్టెంట్ షాకిచ్చాడు. ప్యాంట్ పాకెట్‌లో ఏదో దాచేశావంటూ నిక్కీ ఒళ్లంతా తడిమేస్తూ హగ్ చేసుకునేందుకు ట్రై చేశాడు. నిక్కీ సీరియస్ అవుతుందేమో అని అంతా అనుకున్నారు అదే వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. కోవిడ్ సమయాల్లో ఎవరైనా కౌగిలించుకోవడానికి ప్రయత్నించినప్పుడు .. అవైడ్ చేయండి..
సురక్షితంగా ఉండండి .. బాగా నిద్రించండి.. సామాజిక దూరాన్ని పాటించండి` అని నిక్కీ కామెంట్ చేసింది.
When someone tries to hug me during covid times.. Lol
Stay safe.. sleep well and maintain social distancing. ???@ColorsTV #NikkiTamboli #TeamNikki #BombshellNikki #AamchiMulgi #MaharashtraChiShaan #NaughtyNikki #biggboss #BiggBoss14 #bb14 #NikkiInBB14 #Nikkians pic.twitter.com/KKxozNizOb— Nikki Tamboli (@nikkitamboli) October 8, 2020