Saturday, November 27, 2021
Homeటాప్ స్టోరీస్ట్రైల‌ర్ టాక్: సోలో బ్ర‌తుకే సోబెట‌ర్..హిట్ సౌండింగ్‌!

ట్రైల‌ర్ టాక్: సోలో బ్ర‌తుకే సోబెట‌ర్..హిట్ సౌండింగ్‌!

ట్రైల‌ర్ టాక్: సోలో బ్ర‌తుకే సోబెట‌ర్..హిట్ సౌండింగ్‌!
ట్రైల‌ర్ టాక్: సోలో బ్ర‌తుకే సోబెట‌ర్..హిట్ సౌండింగ్‌!

మెగామేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ `ప్ర‌తిరోజు పండ‌గే` చిత్రంతో మ‌ళ్లీ స‌క్సెస్ బాట ప‌ట్టాడు. ఈ మూవీ త‌రువాత త‌న నుంచి వ‌స్తున్న చిత్రం `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌`. కొత్త ద‌ర్శ‌కుడు సుబ్బు ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. న‌భా న‌టేష్ క‌థానాయిక‌గా న‌టించింది. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిస్మ‌స్ కానుక‌గా ఈ మూవీ ఈ నెల 25న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని చిత్ర బృందం శనివారం సోష‌ల్ మీడియా వేదిక‌గా రిలీజ్ చేసింది. సాయిధ‌ర‌మ్‌తేజ్ క‌కౌట్‌ని స్టూడెంట్స్ త‌గ‌ల‌బెడుతున్న విజువ‌ల్స్‌లో ట్రైల‌ర్ మొద‌లైంది. పెద్ద సంఖ్య‌లో వీ వాంట్ జస్టీస్ అంటూ స్టూడెంట్స్ నినాదాలు చేస్తుండ‌టం ఇంట్రెస్టింగ్‌గా వుంది. ఇంత‌కీ వీడెవ‌డు.. ఏం చేసుంటాడు.. ఇంత ఖ‌ర్చు చేసి వీడి క‌టౌట్‌ని ఎందుకు త‌గ‌ల‌బెడుతున్నారు. ఇదంతా తెలియాలంటే మీరు నా క‌థ‌లోకి రావాల్సిందే అంటూ హీరో సాయి ధ‌ర‌మ్‌తేజ్ చెబుతున్న డైలాగ్‌లు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

ప్రేమ, పెళ్లి అంటే ద్వేషాన్ని చూపించే ఓ యువ‌కుడు అనుకోకుండా ఎలా ప్రేమ‌లో ప‌డ్డాడు? ఆ త‌రువాత అత‌ని జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది? స‌్టూడెంట్ అత‌న్ని ఎందుకు ద్వేషిస్తున్నారు. వంటి ఆస‌క్తిక‌ర అంశాల నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ సాగుతుంద‌ని తెలుస్తోంది. మూవీ విజువ‌ల్స్‌, సాయి ధ‌ర‌మ్‌తేజ్ క్యారెక్ట‌రైజేష‌న్‌, త‌మ‌న్ సంగీతం.. ఇవ‌న్నీ చూస్తుంటే సోలో బ్ర‌తుకే సోబెట‌ర్..హిట్ సౌండింగ్ వినిపిస్తోంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts