Homeటాప్ స్టోరీస్“ప్రేమికుల రోజు” నాడు మాట మార్చిన మెగా ప్రిన్స్

“ప్రేమికుల రోజు” నాడు మాట మార్చిన మెగా ప్రిన్స్

Solo Brathuke So Better Theme Video
Solo Brathuke So Better Theme Video

“కోపం,ఇష్టం,విచారం,సంతోషం,ఆనందం,బాధ ఇవన్నీ కాలంతోపాటు కారణాలతోపాటు మారిపోయే ఫీలింగ్స్. మరి ప్రేమ కూడా ఒక ఫీలింగ్ గే కదా..! మారిపోదని గ్యారెంటీ ఏంటి.?” అని గట్టిగా నిలదీస్తున్నాడు..మెగా సుప్రీమ్ హీరో సాయితేజ్. మన గోల్ ఏంటి.? అని అడిగితే సోలో లైఫ్ అనీ, మన అజెండా ఏంటి.? అని అడిగితే ఫ్రీడమ్ అని సింగిల్ క్లబ్ మెంబర్ ల చేత చెప్పిస్తున్నాడు. ఇక తను మాట్లాడుతున్నప్పుడు వెనకాల జీవితంలో బ్రహ్మచారులు గా మిగిలిపోయిన గొప్పవాళ్లు అయిన అటల్ బిహారీ వాజ్ పేయి, ఆర్ నారాయణ మూర్తి, మరియు అబ్దుల్ కలాం అలాంటి మహానుభావుల ఫోటోలు పెట్టుకున్నాడు.

ఇదంతా “సోలో బ్రతుకే సో బెటర్” అనే సినిమా కోసం. ఈ సినిమాలో సాయి తేజ సరసన ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై B.V.S.N ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు తేజ్ జాన్ జిగిరీ దోస్త్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. సుబ్బు అనే ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు.

- Advertisement -

వెరైటీ ఏంటంటే ఇంతకు ముందు ఇదే సాయితేజ్ “పిల్లా నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే” అని ప్రేమ పాఠాలు చెప్పాడు. ఆయన కెరీర్ లో కూడా ఎక్కువ శాతం ప్రేమకథలు చేశారు. ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న సాయితేజ్ ను చూసి అభిమానులు అందరూ సరదాగా “అన్న.. ఏంటి మాట మార్చారు.?” అని సోషల్ మీడియాలో ట్రోల్ పోస్టులు పెడుతున్నారు. ఇక “సోలో బ్రతుకే సో బెటర్” సినిమా వేసవిలో విడుదల అయ్యే సినిమాల బరిలో ఉంది. మే 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All