Homeటాప్ స్టోరీస్బ్రేక‌ప్ సాంగ్‌ల‌కి కొత్త ట‌చ్ ఇస్తార‌ట‌!

బ్రేక‌ప్ సాంగ్‌ల‌కి కొత్త ట‌చ్ ఇస్తార‌ట‌!

బ్రేక‌ప్ సాంగ్‌ల‌కి కొత్త ట‌చ్ ఇస్తార‌ట‌!
బ్రేక‌ప్ సాంగ్‌ల‌కి కొత్త ట‌చ్ ఇస్తార‌ట‌!

మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌ `ప్ర‌తిరోజు పండ‌గే` హిట్ త‌రువాత మంచి జోష్ మీదున్నాడు. ప్ర‌స్తుతం `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ మ్యూజిక‌ల్ ల‌వ్‌స్టోరీ ద్వారా సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్ గా సింగిల్స్ అంథెమ్‌ని రిలీజ్ చేశారు. సింగిల్ ఫ‌ర్ ఎవ‌ర్ అనే కాన్సెప్ట్‌తో రొమాంటికి ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి థ‌ర్డ్ సింగిల్ రాబోతోంది. `అమృత‌.. ` అంటూ బ్రేక‌ప్ సాంగ్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. అయితే ఈ సారి బ్రేక‌ప్ సాంగ్ ని మ‌రింత కొత్త‌గా ప్లాన్ చేస్తున్నార‌ట‌.

- Advertisement -

ప్రేమ‌క‌థ‌ల్లో బ్రేక‌ప్ సాంగ్ అన్న‌ది కామ‌న్‌. అయితే ఈ ద‌ఫా బ్రేక‌ప్ సాంగ్‌కి స‌రికొత్త నిర్వ‌చ‌నం ఇవ్వ‌బోతున్నార‌ట‌. ఈ నెల 15న ఉద‌యం 10 గంట‌ల‌కు భ‌గ్న ప్రేమికుల కోసం కొత్త పంథాలో బ్రేక‌ప్ సాంగ్‌ని రిలీజ్ చేయ‌బోతున్నాం` అని మేక‌ర్స్ స్ప‌ష్టం చేశారు. ఈ పాట ఎలా వుండబోతోంద‌న్న‌ది తెలియాలంటే ఈ నెల 15 ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాట కోసం ఆయ‌న స‌రికొత్త స్వ‌రాల‌ని అందిస్తున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All