Sunday, December 4, 2022
Homeటాప్ స్టోరీస్మేగామేన‌ల్లుడి SBSBతో టాలీవుడ్‌కు కొత్త క‌ళ!

మేగామేన‌ల్లుడి SBSBతో టాలీవుడ్‌కు కొత్త క‌ళ!

మేగామేన‌ల్లుడి SBSBతో టాలీవుడ్‌కు కొత్త క‌ళ!
మేగామేన‌ల్లుడి SBSBతో టాలీవుడ్‌కు కొత్త క‌ళ!

థియేట‌ర్లు మూత‌ప‌డి దాదాపు తొమ్మిది నెల‌ల‌వుతోంది. తాజాగా లాక్‌డౌన్ నిబంధ‌న‌లు స‌డ‌లించ‌డంతో థియేట‌ర్లు ఒక్కొక్క‌టిగా తెరుచుకుంటున్నాయి. అయితే థియేట‌ర్లు రీఓపెన్ అయితే అవుతున్నాయి కానీ థియేట‌ర్ల‌కి రావ‌డానికి జ‌నాలు మాత్రం ఆస‌క్తిని చూపించ‌డం లేదు. తాజాగా విడుద‌లైన `క‌రోనా వైర‌స్‌`, హాలీవుడ్ ఫిల్మ్ `టెనెట్‌` చిత్రాల‌కు ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల నుంచి స్పంద‌న క‌రువైంది. దీంతో ప్రేక్ష‌కుల్ని ఆశించిన స్థాయిలో థియేట‌ర్ల‌కి ర‌ప్పించాలంటే స్టార్ సినిమాల్ని రిలీజ్ చేయాల్సందే అన్న టాక్ మొద‌లైంది.

- Advertisement -

ఈ నేప‌థ్యంలో మేగామేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టించిన `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌` థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. గ‌త తొమ్మిది నెల‌లుగా విడుద‌ల వాయిదాప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ ఈ నెల 25న క్రిస్మ‌స్ కానుక‌గా థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతోంది. ఇటీవ‌లే సాంగ్ టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు. కానీ ఆడియ‌న్స్‌లో మాత్రం ఇంకా న‌మ్మ‌కం కుద‌ర‌డం లేదు. తాజాగా ఈ మూవీ విడుద‌ల‌వుతున్న థియేట‌ర్ల లిస్ట్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది.

దీనితో పాటు శ‌నివారం ఈ మూవీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ని రిలీజ్ చేయ‌డంతో ఆడియ‌న్స్‌లో ఈ మూవీపై పూర్తి స్థాయిలో న‌మ్మ‌కం ఏర్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ మూవీకి సంబఃధించిన థియేట‌ర్స్ లిస్ట్ పోస్ట‌ర్ వైర‌ల్ అవుతోంది. ఈ మూవీ రిలీజ్ కోసం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌న్నీ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ మూవీతో 50 శాతం కోవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఫుల్ అయితే టాలీవుడ్‌కు కొత్త క‌ళ మొద‌లైన‌ట్టే అని చ‌ర్చ‌న‌డుస్తోంది. ఏం జ‌ర‌గ‌బోతోంద‌న్న‌ది తెలియాలంటే ఈ నెల 25 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts