Homeటాప్ స్టోరీస్`సాఫ్ట్‌వేర్ సుధీర్` మూవీ రివ్యూ

`సాఫ్ట్‌వేర్ సుధీర్` మూవీ రివ్యూ

`సాఫ్ట్‌వేర్ సుధీర్` మూవీ రివ్యూ
`సాఫ్ట్‌వేర్ సుధీర్` మూవీ రివ్యూ

మూవీ రివ్యూ: సాఫ్ట్‌వేర్ సుధీర్
న‌టీన‌టులు: సుడిగాలి సుధీర్‌, ధ‌న్య‌బాల‌కృష్ణ‌, నాజ‌ర్‌, ఇంద్ర‌జ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, షాయాజీ షిండే, పృథ్వీ, గ‌ద్ద‌ర్‌, శివ‌ప్ర‌సాద్ త‌దిత‌రులు న‌టించారు.
ద‌ర్శ‌క‌త్వం: పులిచ‌ర్ల రాజ‌శేఖ‌ర్‌రెడ్డి,
నిర్మాత‌: శేఖ‌ర్‌రాజు,
సంగీతం: భీమ్స్‌,
రేటింగ్‌: 3.25/5

జ‌బ‌ర్దస్త్, ఢీ, పోరా పోవే వంటి టీవీ షోస్‌తో పాపుల‌ర్ అయ్యారు సుడిగాలి సుధీర్‌. బుల్లితెర‌పై మంచి క్రేజ్‌ని తెచ్చుకున్నారు. ఆయ‌న‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ శేఖర ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కె. శేఖ‌ర్ రాజు నిర్మించిన చిత్రం `సాఫ్ట్‌వేర్ సుధీర్‌`. ధ‌న్య బాల‌కృష్ణ క‌థానాయిక‌. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌ధానంగా రూపొందిన ఈ చిత్రాన్నిఅంతర్లీనంగా మంచి సందేశంతో నిర్మించిన‌ ఈ సినిమా ఈ శ‌నివారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ కామెడీతో ఆక‌ట్టుకున్న సుడిగాలి సుధీర్ వెండితెర‌పై హీరోగా ఏ మేర‌కు ఆక‌ట్టుకున్నాడు?. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు అనుగుణంగానే `సాఫ్ట్వేరు సుధీర్ వుందా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

క‌థ‌:
చందు అమాయ‌కుడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తుంటాడు. అత‌ను ఏ అమ్మాయిని చూసినా ప‌ట్టించుకోదు. అయితే అత‌ని అమాయ‌క‌త్వాన్ని గ‌మ‌నించిన‌ స్వాతి (ధ‌న్య‌బాల‌కృష్ణ‌) చందూని ప్రేమ‌లో ప‌డేస్తుంది. వీరి ప్రేమ‌కు ఇరు కుటుంబాలు అంగీక‌రించ‌డంతో నిశ్చితార్థం జ‌రుగుతుంది. ఆ త‌రువాత స్వాతి కుటుంబంలో అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయి. దీంతో స్వాతి కుటుంబం ఓ స్వామీజీని క‌లుస్తారు. చందుని అడ్డుపెట్టుకుని అత‌ని తండ్రి ప‌నిచేస్తున్న మంత్రి ద‌గ్గ‌ర స్వామీ వెయ్యి కోట్లు కొట్టేస్వాడు. అది చందూ మొడ‌కు చుట్టుకుంటుంది. చందూ ఆ వెయ్యి కోట్ల‌ని రాబ‌ట్టిగ‌లిగాడా?. ఇంత‌కి చందూని ఈ వివాదంలో ఇరికించిన స్వామీజీ ఎవ‌రు?, సుధీర్‌ని అడ్డు పెట్టుకుని అంత డ‌బ్బుని ఎందుకు కొట్టేశారు అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల న‌ట‌న‌:
బుల్లితెర‌పై త‌న‌దైన మార్కు పంచ్‌ల‌తో ఆక‌ట్టుకున్న సుడిగాలి సుధీర్ తొలి సారి హీరోగా ప‌రిచ‌య‌మైన చిత్ర‌మిది. వెండితెర‌పై కూడా అదే స్థాయి ఎన‌ర్జీతో అల‌రించే ప్ర‌య‌త్నం చేశారు. డ్యాన్సుల్లోనూ, ఫైట్స్‌లోనూ సుధీర్ మాస్ హీరో స్థాయిలో అద‌ర‌గొట్టారు. అమాయ‌కుడైన‌ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌గా సుధీర్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. బుల్లితెర‌పై పంచ్‌లు వేసే సుధీర్ ఈ సినిమాలోనూ అదే స్థాయిలో కామెడీని పండించారు. హీరోయిన్‌గా న‌టించిన ధ‌న్య బాల‌కృష్ణ రెండు భిన్న‌మైన షేడ్స్‌లో న‌టించి ఆక‌ట్టుకుంది. పాట‌ల్లో గ్లామ‌ర్‌తో, క్లైమాక్స్‌లో న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. హీరో త‌ల్లిదండ్రులుగా న‌టించిన షాయాజీ షిండే, ఇంద్ర‌జ‌, మంత్రి పాత్ర‌లో న‌టించిన శివ‌ప్ర‌సాద్‌, మావ‌య్య పాత్ర‌లో న‌టించిన పోసాని కృష్ణ‌ముర‌ళి త‌మ ప‌రిధిమేర‌కు న‌టించి మెప్పించారు.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు:
కామెడీ ప్ర‌ధానంగా సాగిన ఈ చిత్రానికి భీమ్స్ అందించిన పాట‌లు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. నేప‌థ్య సంగీతం విష‌యంలో మ‌రిన్ని జాత్ర‌త్త‌లు తీసుకుంటే బాగుండేది. భారీ చిత్రాల‌కు సినిమాటోగ్ర‌ఫీని అందించిన సి. రామ్‌ప్ర‌సాద్ ఈ సినిమాకు కెమెరామెన్‌గా వ‌ర్క్ చేశారు. ఆయ‌న అనుభ‌వం కొంత వర‌కు ప‌నిచేసింది. అయితే సీనియ‌ర్ ఎడిట‌ర్ గౌతంరాజు ఈ సినిమా విష‌యంలో త‌న క‌త్తెర‌కు మ‌రింత పని క‌ల్నించి వుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌ధానంగా సాగే ఈ త‌ర‌హా చిత్రాల‌కు ఎడిటింగ్ మ‌రింత క్రిస్పీగా వుంటే బాగుండేది.

చివ‌ర‌గా:
సుడిగాలి సుధీర్ హీరోగా వ‌స్తున్న తొలి సినిమా అంటే అంతా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని ఆశిస్తారు. అయితే ఆ స్థాయిలో సుధీర్‌ని ద‌ర్శ‌కుడు వాడుకోలేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కొంత మేర లాజిక్‌లేని స‌న్నివేశాల‌తో సాగినా సుధీర్ త‌న‌తైన పంచ్‌ల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. క‌థ బ‌లంగా వున్నా క‌థ‌నంలో కొన్ని లోపాల్ని స‌వ‌రిస్తే సినిమా ఫ‌లితం మ‌రోలా వుండేది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ అనిపించిన ఈ సినిమా రెండ‌వ భాగం థ్రిల్ల‌ర్ చిత్రాన్ని త‌ల‌పిస్తుంది. ఈ విష‌యంలో కొన్ని జాగ్ర‌త్తలు తీసుకుంటే మ‌రింత మందికి సినిమా చేరువ‌య్యేది. ఓవ‌రాల్‌గా సుడిగాలి సుధీర్ నుంచి ప్రేక్ష‌కులు కోరుకునే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని, థ్రిల్‌ని క‌లిగిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

పంచ్ లైన్‌: సాఫ్ట్ వేర్ సుధీర్ ఎంట‌ర్‌టైన్ చేస్తాడు

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All