
‘జబర్దస్త్, ఢీ, పోవే పోరా’ వంటి సూపర్‌హిట్ టెలివిజన్ షోస్ ద్వారా ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్ సుధీర్‘. శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బేనర్‌పై ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్ రాజు ఈ చిత్రాన్నినిర్మించారు. మంచి సందేశంతో ఆద్యంతం వినోదాత్మకంగా ఈ సినిమా ద్వారా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్‌లో కథ నడుస్తుంది. ఫుల్ లెంగ్త్ కామెడీతో పాటు ఎమోషన్స్‌తో సినిమా ఆద్యంతం అలరించే విధంగా రూపొందించారు. సడిగాలి సుధీర్ సాఫ్ట్ వేర్ గా కనిపించాడు. ఎంత మందిని ట్రై చేసినా అతనికి ఏ అమ్మాయి పడదు. అలాంటి వాడి కోసమే చూస్తున్న ఓ యువతి సుధీర్‌ని ప్రేమలోకి దింపుతుంది. అతని ద్వారా తన తండ్రి కలని నిజం చేయాలని ప్రయత్నిస్తుంది. ఆమె తండ్రి నాజర్. రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని ఫండ్‌ని ఏర్పాటు చేస్తాడు. అయితే ఆ ఫండ్ రైతులకు చేరకుండానే ఆయన మరణిస్తాడు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం కోసం అతని కూతురు ధన్యబాలకృష్ణ సాఫ్ట్‌వేర్ సుధీర్‌ని వాడుకుంటుంది. ఈ క్రమంలో సాఫ్ట్‌గా వుండే సుధీర్ మధ్య మధ్యలో వైలెంట్‌గా మారుతుంటాడు.
సుధీర్ అలా మారడానికి గల కారణం ఏంటీ? ఇంతకీ సుధీర్‌ని నమ్ముకుని తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలనుకున్న ధన్య కల నెరవేరిందా? ఆమె కలని నిజం చేసి రౌతులకు అందాల్సిన డబ్బుని సాఫ్ట్‌వేర్ సుధీర్ అందేలా చేశాడా? సుధీర్‌ని ఆవహించిన అతీత శక్తి ఎవరు? అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే సాఫ్ట్‌వేర్ సుధీర్ చూడాల్సిందే. జబర్దస్త్ బ్యాచ్ పంచ్‌లు, ప్రజా గాయకుడు గద్దర్ రౌతుల నేపథ్యంలో పాడిన పాట. సుడిగాలి సుధీర్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.