Homeరివ్యూస్సోడ గోలీ సోడ రివ్యూ

సోడ గోలీ సోడ రివ్యూ

soda goli soda telugu movie reviewనటీనటులు : మానస్ , నిత్యా నరేష్ , కారుణ్య , బ్రహ్మానందం
సంగీతం : భరత్
నిర్మాత : భువనగిరి సత్య సింధూజ
దర్శకత్వం : మల్లూరి హరిబాబు
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 16 ఫిబ్రవరి 2018

 

- Advertisement -

డాక్టర్ వృత్తిలో ఉంటూ సినిమాల పట్ల మక్కువతో నిర్మాతగా మారి భువనగిరి సత్య నిర్మించిన చిత్రం ” సోడ గోలీ సోడ ”. మానస్ , నిత్యా నరేష్ , కారుణ్య , బ్రహ్మానందం , అలీ , కృష్ణభగవాన్ తదితర తారాగణంతో మల్లూరి హరిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

జువ్వా ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ని స్థాపించి సినిమా తీయాలని నిర్మాతల కోసం ఎదురు చూస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతుంటాడు దర్శకుడు కొరటాల వినాయక్ (అలీ ) . అయితే అతడి నిరీక్షణ ఫలించి కోటి రూపాయలు పెట్టే గొట్టం నిర్మాత దొరుకుతాడు అయితే సినిమా తీయాలంటే ఆ కోటి రూపాయలు సరిపోవని ఇంకా సగం పెట్టే హీరో కోసం వెదుకుతున్న సమయంలో హీరో కావాలని ఊర్లో నుండి హైదరాబాద్ కు వచ్చిన శ్రీను (మానస్ ) ఈ విషయాన్నీ పసిగట్టి తాను పెద్ద కోటీశ్వరుడినని నమ్మించి సినిమా ప్రారంభం అయ్యేలా చేస్తాడు . అయితే శ్రీను కోటీశ్వరుడు కాదని , నిరుపేద అని తెలియడంతో సినిమా ఆగిపోతుంది . మరి ఆ సినిమాని కంప్లీట్ చేయడానికి శ్రీను , కొరటాల వినాయక్ ఎలాంటి కష్టాలు పడ్డారు ? చివరకు ఆ సినిమా పూర్తయ్యిందా ? హీరో కావాలన్నా శ్రీను కోరిక నెరవేరిందా ? లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

మానస్

 

డ్రా బ్యాక్స్ :

కథనం

నటీనటుల ప్రతిభ :

యంగ్ హీరో మానస్ శ్రీను పాత్రలో అలరించాడు . డ్యాన్స్ లోను , నటనలోనూ మంచి పరిణతి కనబరిచాడు . కొరటాల వినాయక్ పాత్రలో అలీ కూడా మెప్పించాడు . అలాగే చమ్మక్ చంద్ర , జబర్దస్ ఆది , కృష్ణభగవాన్ , బ్రహ్మానందం , ఫిష్ వెంకట్ , గబ్బర్ సింగ్ బ్యాచ్ ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు , నవ్వించడానికి ప్రయత్నం చేసారు . హీరోయిన్ లు నిత్యా నరేష్ , కారుణ్య లు కూడా అలరించారు .

సాంకేతిక వర్గం :

ముజీర్ మాలిక్ అందించిన ఛాయాగ్రహణం సినిమాకు మరింత ఆకర్షణ గా మారింది . భరత్ అందించిన సంగీతం కూడా ఫరవాలేదు . భువనగిరి సత్య నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు విషయానికి వస్తే ……. … స్వశక్తి తో ఎదగాలని యువత కు సందేశం ఇస్తూ వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు . అయితే స్క్రీన్ ప్లే పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే మరింతగా బాగుండేది .

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All