Homeటాప్ స్టోరీస్స్నేహా ఉల్లాల్ `ఎక్స్‌పైరీ డేట్‌`!

స్నేహా ఉల్లాల్ `ఎక్స్‌పైరీ డేట్‌`!

స్నేహా ఉల్లాల్ `ఎక్స్‌పైరీ డేట్‌`!
స్నేహా ఉల్లాల్ `ఎక్స్‌పైరీ డేట్‌`!

కొంత మందికి అందం, అభిన‌యం వున్నా టైమ్ క‌లిసిరాదు. కొంత మందికి ఏమీ లేక‌పోయినా టైమ్ మాత్రం సూప‌ర్‌గా వుంటుంది. యంగ్ హీరోయిన్ స్నేహా ఉల్లాల్ ప‌రిస్థితి అంతే. ఐశ్వ‌ర్యారాయ్‌ని మ‌రిపించే అందం, అభిన‌యం స్నేహా ఉల్లాల్ సొంతం. అయితే ఆమెకు ఐశ్వ‌ర్య త‌ర‌హా అదృష్టం మాత్రం కాసింద కూడా లేదు. దాంతో ఆశించిన స్థాయిలో అవ‌కాశాల్ని ద‌క్కించుకోలేక‌పోయింది. స‌ల్మాన్ ఖాన్ `ల‌క్కీ నో టైమ్ ఫ‌ర్ ల‌వ్‌` సినిమాతో బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా కాలం క‌లిసి రాక‌పోవ‌డంతో అనుకున్న స్థాయిలో హీరోయిన్‌గా నిల‌దొక్కుకోలేక‌పోయింది.

తెలుగులొ ఉల్లాసంగా ఉత్సాహంగా, సింహా, నేను మీకు తెలుసా, క‌రెంట్, యాక్ష‌న్ 3డీ వంటి చిత్రాల్లో న‌టించినా ఎలాంటి ఫ‌లితం లేకుండా పోయింది. దీనికి తోడు విధి కూడా స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం, యాక్సిడెంట్ కావ‌డంతో కొన్నాళ్ల పాటు సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చింది. తాజాగా ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌డానికి రెడీ అవుతోంది.

- Advertisement -

స్నేహా ఉల్లాల్ న‌టిస్తున్న తాజా వెబ్ సిరీస్ `ఎక్స్‌పైరీ డేట్‌`. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ వెబ్ సిరీస్ అక్టోబ‌ర్‌లో రిలీజ్ కాబోతోంది. ‌క‌రోనా ఎఫెక్ట్ కారణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ వెబ్ సిరీస్ అక్టోబ‌ర్‌లో ప‌క్కాగా రిలీజ్ కానుంద‌ని తెలిసింది. ఇందులో మ‌ధుశాలిని, అలీ రెజా, భ‌ర‌త్‌రెడ్డి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ‌ర‌త్ మ‌రార్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు శంక‌ర్ మార్తాండ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All