
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దగ్గర ముంబయ్ లో వర్క్ చేసిన తెలుగు కుర్రాడు కొండవీటి శివకుమార్ చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఫెషన్ తో సినిమా ఇండస్ట్రీ కి వచ్చి తెలుగులో పలువురు సాంకేతిక నిపుణులు దగ్గర వివిధ విభాగాలలో పనిచేసారు.
ముంబయ్ లో రాంగోపాల్ వర్మ దగ్గర పలు సినిమాలకు వర్క్ చేసి అమెరికా వెళ్లి ఫిల్మ్ మేకింగ్ కోర్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తూ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసిన శివకుమార్ అవార్డు లతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు పొందారు.ఇప్పుడు తానే స్వయంగా SMILE MAN అనే సినిమాని నిర్మిస్తున్నారు.
నూతన నటీనటులను హీరోహీరోయిన్స్ గా పరిచయం చేస్తూ హాలీవుడ్ యాక్టర్స్ తో మరియ హాలీవుడ్ టెక్నీషియన్స్ తో, అమెరికాలోని అందమైన పలు లొకేషన్స్ లో పూర్తిస్థాయి హాలీవుడ్ మూవీని నిర్మించనున్నారు.
త్వరలో మొదలవ్వబోయే ఈ SMILE MAN movie కి సంబంధించిన నటీనటులు,టెక్నీషియన్స్ పూర్తి వివరాలు త్వరలో మీడియాకి వెల్లడించనున్నారు డైరెక్టర్,ప్రొడ్యూసర్ శివకుమార్ కొండవీటి.
