Homeఎక్స్ క్లూసివ్పవన్ కళ్యాణ్ పై చెప్పుతో దాడి

పవన్ కళ్యాణ్ పై చెప్పుతో దాడి

జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ పై చెప్పుతో దాడి చేసారు ఆగంతకులు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన  ఈరోజు కొత్తగూడెం నుండి ఖమ్మం వస్తుండగా మార్గ మద్యంలో జరిగింది . అయితే గుంపులో ఎక్కువగా మంది ఉండటం , విసిరిన చెప్పు పవన్ కళ్యాణ్ కు తాకకుండా కారు ముందు భాగం అయిన బానెట్ మీద పడటంతో ఊపిరి పీల్చుకున్నారు . పవన్ కళ్యాణ్ కు పూల తో భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్న సమయంలో ఇలా చెప్పు ని పవన్ మీదకు విసరడం అభిమానులను విస్మయానికి గురి చేసింది . 
 
అందుకేనేమో ఖమ్మంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాపై దాడి చేసినా భరిస్తాను కానీ ప్రజా సమస్యల ప్రస్తావనలో మాత్రం వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేసాడు . మూడు రోజుల తెలంగాణ టూర్ లో భాగంగా మొన్న హైదరాబాద్ నుండి కొండగట్టు కు చేరుకొని అక్కడి నుండి కరీంనగర్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుండి కొత్తగూడెం చేరుకున్నాడు పవన్ కళ్యాణ్ . ఇక ఈరోజు కొత్తగూడెం నుండి ఖమ్మం చేరుకొని అభిమానులను , కార్యకర్తలను కలుసుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All