
ఆర్ఆర్ఆర్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఓ పాన్ మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మించబడుతుంది. ఈ మూవీ లో చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తుండగా..శ్రీకాంత్ , అంజలి, సునీల్ మొదలగు వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. ఇదిలా ఉంటె ఈ మూవీ లో శంకర్ ..ఓ డైరెక్టర్ ను విలన్ గా చూపించబోతున్నాడట. ‘ఖుషీ’ .. ‘వాలి’.. ‘నాని’ ..కొమరం పులి వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన ఎస్.జె. సూర్య ఆ తరువాత నటుడిగా బిజీ అయ్యాడు.
ముఖ్యంగా ఆయన విలన్ పాత్రలకు ఫేమస్ అయ్యాడు. ‘స్పైడర్’ సినిమాతో ప్రతినాయకుడిగా ఆయనకి మంచి మార్కులు దక్కాయి. ఇక రీసెంట్ గా తమిళంలో వచ్చిన ‘మానాడు’లో చేసిన విలన్ పాత్ర కూడా ఆయనకి మరింత మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ తరుణంలో శంకర్ కన్ను సూర్య ఫై పడిందట. ఈ సినిమాలో చరణ్ ఎలక్షన్ కమిషనర్ పాత్రలో నటిస్తుండగా ముఖ్యమంత్రి పాత్రలో ఎస్.జె. సూర్య కనిపించనున్నాడని అంటున్నారు. ఒక ఎలక్షన్ కమిషనర్ కీ .. ముఖ్యమంత్రికి మధ్య జరిగే వార్ తో ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. మరి సూర్య – చరణ్ ల మధ్య యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. 2023 లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.