Homeటాప్ స్టోరీస్“నేను ఉన్నాను..! నన్ను అడగండి” - శివాజీ రాజా

“నేను ఉన్నాను..! నన్ను అడగండి” – శివాజీ రాజా

“నేను ఉన్నాను..! నన్ను అడగండి” -  శివాజీ రాజా
“నేను ఉన్నాను..! నన్ను అడగండి” – శివాజీ రాజా

భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఈ నెల 31 వరకు వైద్యము, అత్యవసర సేవలు, నిత్యవసర వస్తువులు సరఫరా మొదలగు వాటిని మినహాయించి అన్ని రకాల వ్యాపార వాణిజ్య సేవలను నిలిపి వేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ ఇదే అదనుగా కొంతమంది దళారులు నిత్యవసర వస్తువులను ఉదాహరణకు పాలు కూరగాయలు మందులు ఇలాంటి వాటి ధరలను అమాతం పెంచేసి అమ్ముతూ.. సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు. ప్రభుత్వం వీలైనంత మేర, ఎక్కడికక్కడ ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

 సినిమా ఇండస్ట్రీ  తరుపున ఇప్పటికే ఎంతోమంది నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు తమ దగ్గర పనిచేసే సిబ్బంది తో పాటు తమను నమ్ముకుని ఉన్న ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక సీనియర్ నటుడు శివాజీ రాజా గారు కూడా తన సోషల్ మీడియా ద్వారా ఒక సందేశాన్ని విడుదల చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించమనీ.. ప్రస్తుత పరిస్థితుల్లో  తక్షణ ఉపశమనం చర్యగా తనకు దగ్గరలో ఉన్న కాలనీలో నిత్యావసర సరుకులు కూరగాయలు, సరుకులు అందిస్తున్నామని తెలియజేశారు.

- Advertisement -

 ఈ విపత్కర పరిస్థితుల్లో మనలను కాపాడటానికి మరియు ఈ కరోనా వైరస్ మహమ్మారి ఇంకా ప్రబలకుండా ఉండటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న పోలీసు శాఖ వారికి, ప్రభుత్వ అధికారులకు, డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ… వారి సూచనమేరకు ప్రజలందరూ కొంతకాలం పాటు స్వీయ నిర్భంధంలో ఇంటి వద్దనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All