Homeటాప్ స్టోరీస్కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా శివ కార్తికేయన్ డాక్టర్

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా శివ కార్తికేయన్ డాక్టర్

siva karthikeyans varun doctor is a hit across languagessiva karthikeyans varun doctor is a hit across languagessiva karthikeyans varun doctor is a hit across languages
siva karthikeyans varun doctor is a hit across languages

తమిళ్ లో మాములు స్థాయి నుండి స్టార్ హీరోగా ఎదిగాడు శివ కార్తికేయన్. తను హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా డాక్టర్. తెలుగులో ఈ చిత్రం వరుణ్ డాక్టర్ గా విడుదలైంది. తెలుగులో ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది కానీ తమిళ్ లో పాజిటివ్ టాక్ ఏ వచ్చింది. ఇక తమిళనాడులో థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు ఇంకా సంశయిస్తోన్న తరుణంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన చిత్రాల్లో టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమాకు వస్తోన్న కలెక్షన్స్ చూసి మిగతా నిర్మాతలు, నటులు, దర్శకులకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనడంలో సందేహం లేదు. తెలుగులో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కానీ కలెక్షన్స్ మాత్రం పాజిటివ్ గానే ఉన్నాయి.

- Advertisement -

ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా సేఫ్ వెంచర్ గా నిలిచింది. ఇక ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను సన్ నెక్స్ట్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు కొనుగోలు చేసాయి. నెట్ ఫ్లిక్స్ ఈ మధ్య ఈ తరహా షేరింగ్ ఒప్పందాలు ఎక్కువగా చేస్తోంది. డిజిటల్ రైట్స్ క్లోజ్ అయినా కానీ ఇంకా ఈ చిత్రం అప్పుడే ఓటిటిలో వచ్చే అవకాశం లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All