Homeన్యూస్సూపర్ హిట్ వరుణ్ డాక్టర్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు?

సూపర్ హిట్ వరుణ్ డాక్టర్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు?

సూపర్ హిట్ వరుణ్ డాక్టర్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు?
సూపర్ హిట్ వరుణ్ డాక్టర్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు?

కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన చిత్రాల్లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం అంటే వరుణ్ డాక్టర్ అని చెప్పవచ్చు. తమిళంలో డాక్టర్ పేరిట విడుదలైన ఈ చిత్రం, తెలుగులో వరుణ్ డాక్టర్ గా డబ్ అయింది. విడుదలకు ముందే చెల్లెమ్మ/ చిట్టెమ్మ సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో చిత్రంపై బజ్ బాగానే వచ్చింది. ఇక చిత్రం విడుదలయ్యాక పాజిటివ్ రివ్యూలతో సినిమా దూసుకుపోయింది. అటు తమిళనాడులో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా డాక్టర్ మంచి వసూళ్లను సాధించింది.

తెలుగులో కూడా వరుణ్ డాక్టర్ హిట్ అనిపించుకుంది. కోటిన్నరకు అటూ ఇటూగా వరుణ్ డాక్టర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ చేయగా దాదాపుగా 65 లక్షల రూపాయల లాభం వచ్చినట్లు సమాచారం. ఫుల్ రన్ ముగిసేనాటికి కోటి రూపాయల లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది.

- Advertisement -

తమిళనాడులో ఇప్పటికీ థియేటర్ బిజినెస్ పై ఉన్న అనుమానాలను పటాపంచలు చేసింది ఈ చిత్రం. ఇక థియేటర్ లో ఈ సినిమా చూడటం మిస్ అయినవారు ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పటినుండా అని ఎదురుచూస్తుండగా దానికి డేట్ కూడా వచ్చేసింది. డాక్టర్ చిత్ర స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. నవంబర్ 5నుండి నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతుందని అంటున్నారు. నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసుకోవడానికి ఒప్పందం చేసుకున్నారట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All