
వరసగా కోలీవుడ్ హీరోలు అందరూ టాలీవుడ్ బాట పడుతున్నారు. ఇప్పటికే హీరో విజయ్ డైరెక్ట్ తెలుగు ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఇక ధనుష్ కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు హీరో శివ కార్తికేయన్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన శివ కార్తికేయన్ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. జాతిరత్నాలు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు అనుదీప్. పూర్తి స్థాయి సిల్లీ స్క్రిప్ట్ గా జాతిరత్నాలు చిత్రాన్ని మలిచిన అనుదీప్ ఈ సారి సీరియస్ థ్రిల్లర్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడు.
శివ కార్తికేయన్ ను అప్రోచ్ అయినట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ ఈ ప్రాజెక్ట్ ను సెట్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశాలున్నాయి.