
మలయాళ హీరో పృధ్విరాజ్ చిత్రాలకు తెలుగులో డిమాండ్ పెరుగుతోంది. ఆయన రూపొందించిన `లూసీఫర్` చిత్రం మలయాళంలో సంచలన విజయాన్ని సాధించింది. మోహన్‌లాల్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించాలని ఇప్పటికే మెగా హీరో రామ్‌చరణ్ రీమేక్ రైట్స్‌ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని చిరంజీవితో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కూడా. ఇదిలా వుంటే పృద్శీరాజ్ నటించిన `డ్రైవింగ్ లైసెన్స్` చిత్రాన్ని కూడా తెలుగులో రీమేక్ చేయబోతున్నారని, హీరో రామ్ చరణ్ రీమేక్ హక్కులు తీసుకున్నారని ప్రచారం జరిగింది కూడా.
తాజాగా పృథ్వీరాజ్ నటించిన ఓ చిత్రం కూడా తెలుగులో రీమేక్ కాబోతోంది. సచీ దర్శకత్వంలో రూపొందిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` మలయాళంలో సంచలన విజయం సాధించింది. ఇందులో పృథ్వీరాజ్, బీజు మీనన్ కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ హీరోగా నటించాడు. ఈ చిత్ర రీమేక్ రైట్స్‌ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవరనాగవంశీ దక్కించుకున్నారని తెలిసింది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవరనాగవంశీ ప్రస్తుతం నితిన్ ,కీర్తి సురేష్‌లతో `రంగ్‌దే`, నానితో `శ్యామ్ సింగరాయ్`. నాగశౌర్యతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మలయాళ చిత్రాన్ని ఎవరితో రీమేక్ చేస్తారన్నది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. ఈ రీమేక్‌కు ఏ హీరో సూటవుతాడు అన్నది కూడా నిర్మాణ సంస్థ వెల్లడించలేదు.