
వరుస విజయాలతో క్రేజీ ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకున్నారు యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఆయన ఇటీవల చేసిన `జెర్సీ`, భీష్మ అనూహ్య విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఈ రెండు చిత్రాల సక్సెస్ అందించిన ఉత్సాహంలో వున్న ఆయన నితిన్‌తో ప్రస్తుంత `రంగ్ దే` చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. విజయవంతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా తాజా షెడ్యూల్‌ని టీమ్ పూర్తి చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. త్వరలో ఈ చిత్ర బృందం పాటల కోసం ఇటలీ వెళ్లబోతోంది. ఇదిలా వుంటే ఈ చిత్ర నిర్మాత మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ రైట్స్‌ని దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రాన్ని పవర్‌స్టార్ వనన్‌తో రీమేక్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీజు మీనన్ పాత్రలో పవన్ .. పృథ్వీరాజ్ సుఎకుమారన్ పాత్రలో రానా కనిపించే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే గురువారం చిత్ర బృందం ఓ ప్రకటన చేసింది. శుక్రవారం సాయంత్రం 4:05 నిమిషాలకు టైటిల్ అండ్ లోగోని అనౌన్స్ చేస్తున్నామంటూ ప్రకటించింది. ఈ అనౌన్స్‌మెంట్ పవర్‌స్టార్‌తో చేయబోతున్న `అయ్యప్పనుమ్ కోషయుమ్` రీమేక్ గురించేనా నఅన్నది ఆసక్తికరంగా మారింది.