Homeటాప్ స్టోరీస్సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ ను దూరం చేస్తున్న సితార

సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ ను దూరం చేస్తున్న సితార

Sitara Entertainments breaking second film syndrome
Sitara Entertainments breaking second film syndrome

టాలీవుడ్ లో సెంటిమెంట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏ పని జరిగినా అందులో సెంటిమెంట్లకు చోటు లేకుండా ఉండదు. దర్శకుల విషయానికొస్తే సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది దర్శకులకు సెకండ్ ఫిల్మ్ తో ప్లాప్ పడక తప్పలేదు. పూరి జగన్నాథ్, సుకుమార్ వంటి దర్శకులు రెండో సినిమాతో ప్లాప్ అందుకున్న వాళ్లే. ఇప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. అందరి విషయంలో ఇదే జరుగుతుంది అని చెప్పలేం కానీ చాలా మంది దర్శకులకు ఇది జరిగింది.

అయితే ఒక నిర్మాణ సంస్థ మాత్రం ఈ సెంటిమెంట్ ను చెరిపేస్తోంది. ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టిన వాళ్లతో సినిమాలను నిర్మించి, హిట్ కొట్టి ఆ దర్శకులకు సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ దూరం అయ్యేలా చేస్తోంది. ఆ నిర్మాణ సంస్థే సితార ఎంటర్టైన్మెంట్స్. రీసెంట్ గా భీష్మ సినిమాను నిర్మించిన సితార, భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుములకు ఇది రెండవ చిత్రం.

- Advertisement -

ఛలో చిత్రంతో హిట్ అందుకున్న వెంకీ కు అడ్వాన్స్ ఇచ్చిన ఈ సంస్థ ఇప్పుడు రెండో సినిమా హిట్ అవ్వడంతో ఆ సిండ్రోమ్ నుండి తప్పించుకున్నాడు ఈ దర్శకుడు. వెంకీ కుడుముల అనే కాదు, గతంలో చందూ మొండేటి, గౌతమ్ తిన్ననూరి విషయంలో కూడా ఇదే జరిగింది. కార్తికేయతో హిట్ అందుకున్న చందూ మొండేటి రెండో సినిమా ప్రేమమ్ తో హిట్ కొట్టాడు. ఆ సినిమాను నిర్మించింది ఈ సంస్థే. అలాగే మళ్ళీ రావాతో అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించుకున్న గౌతమ్ తిన్ననూరి విషయంలో కూడా ఇదే జరిగింది. నానితో తీసిన జెర్సీ సూపర్ డూపర్ హిట్.

ప్రస్తుతం నితిన్ తోనే ఈ సంస్థ రంగ్ దే సినిమాను నిర్మిస్తోంది. దాని దర్శకుడు వెంకీ అట్లూరి రెండవ సినిమా mr. మజ్ను ప్లాప్ కాగా మూడవ సినిమా రంగ్ దే. అలాగే నానితో కూడా ఒక సినిమాను నిర్మించనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All