Homeటాప్ స్టోరీస్సీత ట్రైలర్ టాక్

సీత ట్రైలర్ టాక్

తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం ” సీత ” . మన్నారా చోప్రా – సోను సుద్ కూడా నటించిన ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు ఉదయం విడుదల చేసారు . మే 24 న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సీత ట్రైలర్ ని నేరుగా రిలీజ్ చేసారు . ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే కాజల్ అగర్వాల్ ఆధునిక సీత లాగా కనిపిస్తోంది .

- Advertisement -

మోడ్రన్ సీత గా కాజల్ కనిపిస్తున్న తీరు యువతకు బాగా నచ్చేలా ఉంది . కాజల్ అందాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయి . రొమాంటిక్ సీన్స్ మాత్రమే కాకుండా యాక్షన్ సీన్స్ కూడా అలరించేలా ఉన్నాయి . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సక్సెస్ కోసం తహతహలాడుతున్నాడు . ఇప్పటివరకు ఈ హీరో నటించిన చిత్రాలేవీ విజయం సాధించలేదు దాంతో సీత అలియాస్ కాజల్ అగర్వాల్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . నేనేరాజు నేనేమంత్రి చిత్రంతో తేజ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు దాంతో సీత పై అంచనాలు నెలకొన్నాయి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All