HomeVideosహను రాఘవపూడి ‘సీతా రామం’ మూవీ..

హను రాఘవపూడి ‘సీతా రామం’ మూవీ..

Sita Ramam Glimpse
Sita Ramam Glimpse

అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ, లై చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన హను రాఘవపూడి ..తాజాగా ‘సీతా రామం’ అనే మూవీ చేస్తున్నాడు. దుల్కర్‌ సల్మాన్‌, మృణాళిని ఠాకూర్‌, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో హృదయాన్ని కదిలించే ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా టైటిల్‌ గ్లింప్స్‌ ని విడుదల చేసి ఆకట్టుకున్నారు .

‘ఇది ఓ సైనికుడు శత్రువుకి అప్పగించిన యుద్ధం అఫ్రీన్‌. ఈ యుద్ధంలో సీతారాములను నువ్వే గెలిపించాలి’ అనే సంభాషణ ఆకట్టుకుంటున్నది. యుద్ధ నేపథ్యంలో నడిచే ఈ ప్రేమకథలో దుల్కర్‌ సల్మాన్‌ లెఫ్టినెంట్‌ రామ్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా సీత పాత్రలో మృణాళిని ఠాకూర్‌ నటిస్తున్నది. కశ్మీర్‌ ముస్లిం అమ్మాయి అఫ్రీన్‌గా రష్మిక మందన్న కీలకమైన పాత్రను పోషిస్తున్నది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. సుమంత్‌, గౌతమ్‌మీనన్‌, ప్రకాష్‌రాజ్‌ తదితరులు ఈ మూవీ లో నటిస్తున్నారు.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All