నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి అయితే నేను మాత్రం రెండో పెళ్లి చేసుకోవడం లేదని ఆ వార్తలను ఖండించింది ప్రముఖ గాయని సునీత . తెలుగులో వందలాది చిత్రాల్లో పాటలు పాడిన సునీత , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది . పలువురు కథానాయికలకు తన గొంతు ని అరువిచ్చి అవార్డు లను రివార్డులను సొంతం చేసుకుంది సునీత . కెరీర్ ప్రారంభంలోనే 19 వ ఏటనే కిరణ్ అనే వ్యక్తి ని పెళ్లి చేసుకుంది సునీత .
అయితే ఇద్దరు పిల్లలు పుట్టాక ఇద్దరి మధ్య విబేధాలు తీవ్ర స్థాయికి చేరాయి దాంతో విడిపోయారు . ఇద్దరు పిల్లలతో సునీత తన కెరీర్ ని కొనసాగిస్తోంది . అయితే భర్త నుండి విడిపోయింది కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోనుంది అని అప్పట్లోనే వార్తలు వచ్చాయి కాగా అప్పుడు రెండో పెళ్లి వార్తలను ఖండించింది సునీత . కట్ చేస్తే మళ్ళీ ఇన్నాళ్లకు మళ్ళీ పెళ్లి అంటూ వార్తలు రావడంతో షాక్ అయిన సునీత రెండో చేసుకోవడం లేదని స్పష్టం చేస్తూ ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే తప్పకుండా మీకు చెబుతానని ఓ వీడియో పోస్ట్ చేసింది సునీత. గాయని గా మధురమైన పాటలను అందించిన సునీత సంసార జీవితంలో మాత్రం గరళం మింగింది .
English Title: singer sunitha gives clarity on marriage rumours