Homeటాప్ స్టోరీస్అల్లరి నరేష్, సునీల్ 'సిల్లీ ఫెల్లోస్ ' టైటిల్ లాంచ్

అల్లరి నరేష్, సునీల్ ‘సిల్లీ ఫెల్లోస్ ‘ టైటిల్ లాంచ్

Silly Fellows Title Launchబ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో ప్రొడక్షన్ 3 గా వస్తున్న చిత్రం “సిల్లీ ఫెల్లోస్”. అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్లా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వం వహిస్తుండగా.. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం రామానాయుడు స్టూడియోలో జరిగింది..

ఈ సందర్భంగా దర్శకుడు భీమినేని శ్రీనివాస్ మాట్లాడుతూ…”అల్లరి నరేష్ తో నేను తీసిన “సుడిగాడు” పెద్ద హిట్ అయ్యింది. మళ్లీ మా కాంబినేషన్ “సిల్లి ఫెల్లోస్”తో రిపేట్ అవుతుండడం ఆనందంగా ఉంది. సునీల్ ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. సునీల్ నుంచి ఆడియన్స్ ఏం ఎక్సపెక్ట్ చేశారో అదే ఈ సినిమాలో ఉంటుంది. హీరోలు అని కాకుండా మంచి కమిట్మెంట్ తో వర్క్ చేశారు ఇద్దరూ. ఇంత మంచి నిర్మాతలను ఇచ్చిన వివేక్ గారికి నా కృతఙ్ఞతలు. బ్లూ ప్లానెట్ లో వచ్చిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సిల్లీ ఫెల్లోస్ మూడవ విజయం అవుతుందని ఆశిస్తున్నా. ఇందులో చిత్రా శుక్లా పాత్ర చాలా డిఫికల్ట్.. అయినా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఒక సంవత్సరం పాటు కష్టపడి హిట్ కొట్టాలనే ఉద్దేశ్యం తోనే వస్తున్నాం. దాదాపు 200 టైటిల్స్ అనుకున్నాం… ఆఖరికి నా ‘ఎస్’ సెంటిమెంట్ ను కూడా వదిలేద్దామనుకున్నా. కానీ అదే “ఎస్”తో టైటిల్ ఫిక్స్ చేసాము. “సిల్లీ ఫెల్లోస్” అందరినీ ఎంటర్టైన్ చేసే చిత్రం అవుతుందని నమ్మకంగా ఉన్నాం” అన్నారు

- Advertisement -

నిర్మాతల్లో ఒకరైన భరత్ చౌదరి మాట్లాడుతూ… “సుడిగాడు కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ ఈ సినిమాను చేస్తున్నాము. సినిమా రిలీజ్ తరువాత మేము సినిమాని ఎందుకు చేశామో తెలుస్తుంది. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది ఈ “సిల్లీ ఫెలోస్”. “నేనె రాజు నేనె మంత్రి, ఎమ్ ఎల్ ఎ” చిత్రాల తర్వాత మా బ్యానర్ లో వస్తున్న 3వ ప్రొడక్షన్ ఈ సినిమా. తప్పకుండా హ్యాట్రిక్ కొడతామని నమ్ముతున్నా” అన్నారు..
ఇవివి గారి సినిమాల తరహా లాంటి సినిమా లు రావడం లేదు అనుకుంటున్న సందర్భంలో భీమినేని శ్రీనివాస్ ఈ కథను మా దగ్గరికి తీసుకు వచ్చారు.. ఆడియన్స్ ను పూర్తి స్థాయిలో నవ్వించేలా సిల్లిఫెల్లోస్ చిత్రం ఉంటుందని తెలిపారు మరో నిర్మాత కిరణ్.

హీరోయిన్ చిత్ర శుక్లా మాట్లాడుతూ.. “నరేష్ సునీల్ గార్లతో వర్క్ చేయడం కొత్త ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది. డిఫికల్ట్ రోల్ ప్లే చేస్తున్నా. బెస్ట్ ఫిల్మ్ తో వస్తున్నాం చూసి ఆదరించాలని కోరుతున్నా” అన్నారు

సునీల్ మాట్లాడుతూ.. “ఆడియన్స్ నా నుంచి ఏదైతే ఇన్నాళ్లు మిస్ అయ్యారో.. అదే నేను కూడా మిస్ అయ్యాను.. కానీ ఈ “సిల్లీ ఫెలోస్”తో ఆ కోరిక తీరనుంది. హెల్తీ వాతావరణం లో షూటింగ్ జరుపుకున్నాము. ఈవివి గారి బ్యానర్ అంటే నాకు ప్రాణం. అలాంటి బ్యానర్ లో మాత్రమే వచ్చాయి “సిల్లి ఫెల్లోస్” లాంటి సినిమాలు. ఈ మధ్య అన్నీ కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీస్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు రావడం లేదు. ఒక్క భీమినేని గారి వలనే అవుతుంది. నరేష్ గారితో వర్క్ చేయడం పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేంత ఫ్రీడమ్ ఏర్పడుతుంది.. అలాంటి మంచి మనిషి అతను. ఒకప్పటి కామెడీ జోనర్ లను తలపించే సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలను” అన్నారు
అల్లరి నరేష్ మాట్లాడుతూ.. “సుడిగాడు లాంటి హిట్ సినిమాను ఇచ్చక మళ్లీ ఈ కాంబినేషన్ లో రావాలంటే మొదట భయం వేసింది. ఆ రేంజ్ హిట్ ఇవ్వగలమా అని, కానీ దాదాపు 3 ఇయర్స్ స్క్రిప్ట్ పై పనిచేసి చేసిన సినిమా “సిల్లీ ఫెల్లోస్”. పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ తో వస్తున్నాం. ఇందుకు తోడయ్యాడు సునీల్. ఈ ప్రొడక్షన్ లో వస్తున్న మూడో సినిమా కనుక తప్పకుండా హ్యాట్రిక్ కొడుతున్నాం” అన్నారు.

అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్లా, పూర్ణ, నందిని రాయ్, బ్రహ్మానందం, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అనిష్ తరుణ్ కుమార్, ఆర్ట్: ఎమ్.కిరణ్ కుమార్, మ్యూజిక్: శ్రీ వసంత్, ఎడిటర్: గౌతమ్ రాజు, యాక్షన్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, భాను, లిరిక్స్: కాశర్ల శ్యామ్, చిలకరెక్క గణేష్, నిర్మాతలు: కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, సహ నిర్మాత: వివేక్ కుచిబొట్ల, దర్శకుడు: భీమినేని శ్రీనివాస్.

Silly-Fellows-First-Look-and-Poster-2

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All