Homeటాప్ స్టోరీస్వాళ్ల బ్రేకప్.. సిద్ధార్థ్ షాకింగ్ ట్వీట్..!

వాళ్ల బ్రేకప్.. సిద్ధార్థ్ షాకింగ్ ట్వీట్..!

Siddharth Shocking Tweet Naga Chaitanya Samantha Divorce

నాగ చైతన్య, సమంత డైవర్స్ తీసుకుంటున్నారన్న న్యూస్ బయటకు రాగానే అందరు షాక్ అయ్యారు. ఏమాయ చేసావె సినిమాతో కలిసి నటించిన ఈ జంట ప్రేమించుకుని.. పెళ్లి చేసుకుని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారని అందరు అనుకున్నారు. మరి తేడాలు ఎక్కడ వచ్చాయో ఏమో కాని చైతు, సమంత ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్న వీరి బ్రేకప్ న్యూస్ ఈరోజు అఫీషియల్ గా చెప్పేశారు.

- Advertisement -

ఈ క్రమంలో ఇలా సమంత, చైతు తమ డైవర్స్ న్యూస్ బయటపెట్టగానే అక్కడ కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ తన ట్విట్టర్ లో ఒక కామెంట్ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. నేను స్కూల్ లో టీచర్ దగ్గర నేర్చుకున్న మొదటి లెసన్.. మోసం చేసిన వాళ్లు ఎప్పుడు అభివృద్ధి చెందరు అని.. నువ్వేమంటావ్ అంటూ ట్వీట్ చేశాడు సిద్ధార్థ్. ఈ ట్వీట్ ఖచ్చితంగా సమంత గురించే అని అనుకుంటున్నారు. చైతుతో లవ్ మ్యారేజ్ కు ముందు సమంత. సిద్దార్థ్ కలిసి తిరిగినట్టు వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం చైతు నుండి విడిపోయిన సమంతని ఉద్దేశించి సిద్ధార్థ్ ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడని చెప్పుకుంటున్నారు. సిద్ధార్థ్ కామెంట్ సమంతని ఉద్దేశించా కాదా అన్నది పక్కన పెడితే కరెక్ట్ టైం కు అతను ఇలా రెస్పాండ్ అవడం ఆలోచనలో పడేస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All