
ఆర్ ఎక్స్ 100`తో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి తన రెండవ చిత్రంగా `మహా సముద్రం` ఏరుతో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మించబోతున్నారు. శర్వానంద్ ఓ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ఆనౌన్స్‌మెంట్ ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే.
అయితే ఇందులో నటించే మరో హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సిద్ధార్ధ్ నటిస్తాడని ప్రచారం జరిగినా ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. తాజా సమాచారం ప్రకారం సిద్ధార్ధ్ ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. `గృహం` వంటి హారర్ థ్రిల్లర్ తరువాత సిద్ధార్ధ్ తెలుగులో మరో చిత్రం చేయలేదు. తాజాగా `మహా సముద్రంని ఓకే చేసినట్టు తెలిసింది.
చిత్ర కథ, సినిమాలోని తన పాత్రకున్న ప్రాముఖ్యత నచ్చడంతో సిద్ధార్ధ్ ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారట. సినిమాలో సిద్ధార్ధ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా వుండబోతోందని తెలిసింది. ప్రతీ వారం ఆసక్తికరమైన అప్‌డేట్‌ని ఇస్తామని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం సిద్ధార్ధ్‌కి సంబంధించిన న్యూస్‌ని చిత్ర వర్గాలు అఫీషియల్ా ప్రకటించనున్నట్టు తెలిసింది.