
గతేడాది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిన్న చిత్రంలో “నీలి నీలి ఆకాశం” సాంగ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ ను దాటుకుని దూసుకుపోయింది. ఈ ఒక్క సాంగ్ వల్ల సినిమా హిట్ అయిందంటే అది అతిశయోక్తి కాదు. అనూప్ రూబెన్స్ అందించగా సిద్ శ్రీరామ్ ఈ సాంగ్ ను పాడాడు.
ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ మ్యాజిక్ ను క్రియేట్ చేయబోతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఈరోజు అలోన్ అలోన్ సాంగ్ విడుదలైంది. సుమంత్ హీరోగా మళ్ళీ మొదలైంది సినిమా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక సాంగ్ విషయానికొస్తే అలోన్ అలోన్ మరోసారి ఆ మ్యాజిక్ ను రిపీట్ చేసేలానే కనిపిస్తోంది.
అనూప్ రూబెన్స్ సోల్ ఫుల్ మెలోడీకి సిద్ శ్రీరామ్ మ్యాజికల్ వాయిస్ తోడై అలోన్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలవనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దుల్కర్ సల్మాన్ వంటి టాప్ స్టార్స్ ఈ సాంగ్ ను ప్రమోట్ చేసారు.
