
`క్రాక్` సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న శృతి ఆ వెంటనే `వకీల్ సాబ్` రూపంలో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ప్రభాస్‌తో కలిసి `సలార్`లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ రాకెట్ స్పీడుతో జరిగిపోతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు.
కోవిడ్ కారణంగా ప్రస్తుతం షెడ్యూల్‌కి బ్రేక్ ఇచ్చారట. ఇదిలా వుంటే శృతి హాసన్ ముంబైలో తన లాక్డౌన్ జీవితం గురించి సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. సెకండ్ వేవ్‌లో భాగంగా భారీ సంఖ్యలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో లాక్డౌన్ విధించింది. ఈ కాలంలో నతకు కంపెనీ ఇవ్వడానికి తన ప్రియుడు సంతను హజారికా, పెంపుడు కుక్క ఉందని శృతి హాసన్ వెల్లడించింది.
ఈ ఇద్దరిని శృతి ‘లాక్‌డౌన్ బడ్డీలు’ అని పిలుస్తోంది. సోషల్ మీడియాలో తన ప్రియుడితో కలిసి వున్న ఫొటోని షేర్ చేసిన శృతి ఇలా వ్రాసింది. `నేను వెర్రి పనులు, సృజనాత్మక పనులను నా అంతరా ఆత్మకు బోర్ కొట్టించాను` అని తెలిపింది. ఇక సెకండ్ వేవ్ కారణంగా బాధపడుతున్న వారి కోసం ప్రార్థనలు చేస్తానంది.
View this post on Instagram