Homeగాసిప్స్రెండు అఫైర్ల గురించి ఓపెన్ అయిన శృతి

రెండు అఫైర్ల గురించి ఓపెన్ అయిన శృతి

Shruti Haasan
రెండు అఫైర్ల గురించి ఓపెన్ అయిన శృతి

దక్షిణాది నుండి హీరోయిన్లు రావడమే చాలా అరుదు, అటువంటిది దక్షిణాదిన ఒక స్టార్ హీరో కూతురైన శృతి హాసన్ ఇండస్ట్రీకి రావడమే కాదు, ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది, బోల్డ్ గా కనిపించింది. హాట్ ఫోజులివ్వడానికి వెనుకాడలేదు. అటువంటి శృతి హాసన్ గత కొంత కాలంగా సైలెంట్ అయిపోయింది. ఆ మధ్య తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సినిమాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన శృతి, ఇప్పుడు ఆ రిలేషన్ షిప్ నుండి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం మళ్ళీ సినిమాలు చేయడానికి సమాయత్తమవుతోంది.

శృతి హాసన్ కు రిలేషన్ షిప్ గురించిన రూమర్స్ కొత్తేమి కాదు. సురేష్ రైనా, సిద్ధార్థ్, విక్రాంత్ వంటి పలువురితో ఆమె పేరు వినిపించేది. అయితే ప్రస్తుతం తాను సింగిల్ అంటోంది శృతి హాసన్. ఎటువంటి రిలేషన్ షిప్ లో లేనని అంటోంది. ఇప్పుడు తన ఫోకస్ అంతా సినిమాల మీదేనని తేల్చేసింది.

- Advertisement -

ఇదిలా ఉంటే తాను గతంలో రెండుసార్లు రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వెల్లడించింది. మొదటిసారి రిలేషన్ లో ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పడానికి భయపడ్డానని, రెండోసారి మాత్రం ధైర్యంగా చెప్పగలిగానని అంది. ఏ రిలేషన్ అయినా జీవితాంతం ఉండాలనే మొదలుపెడతామని అయితే అది అన్నిసార్లూ జరగదనని వేదాంతం మాట్లాడుతోంది. అయితే రిలేషన్ లో ఎంటర్ అయినప్పుడు, రిలేషన్ లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తాను హ్యాపీగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All