Homeన్యూస్శృతి హాసన్ తో హ్యాట్రిక్ ను కన్ఫర్మ్ చేసిన క్రాక్ దర్శకుడు

శృతి హాసన్ తో హ్యాట్రిక్ ను కన్ఫర్మ్ చేసిన క్రాక్ దర్శకుడు

శృతి హాసన్ తో హ్యాట్రిక్ ను కన్ఫర్మ్ చేసిన క్రాక్ దర్శకుడు
శృతి హాసన్ తో హ్యాట్రిక్ ను కన్ఫర్మ్ చేసిన క్రాక్ దర్శకుడు

క్రాక్ చిత్రంతో చాలా మంది బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వగా అప్పటిదాకా ప్లాపుల్లో ఉన్న రవితేజ, గోపీచంద్ మలినేనిలకు ఈ చిత్రం భారీ బూస్ట్ ను ఇచ్చిందని చెప్పొచ్చు. అలాగే శృతి హాసన్ టాలీవుడ్ నుండి బ్రేక్ తీసుకుని తిరిగి ఈ చిత్రంతో ఎంట్రీ ఇవ్వడంతో మళ్ళీ టాప్ రేంజ్ కు చేరుకుంది.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణతో సినిమాపై వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఎన్బికే107గా పిలవబడుతోన్న ఈ ప్రాజెక్ట్ నిజ జీవిత సంఘటనల నుండి స్ఫూర్తి తీసుకుని రూపొందుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుందని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది. శృతి హాసన్, నందమూరి బాలకృష్ణ సరసన ఫీమేల్ లీడ్ గా చేయడానికి ఒప్పుకుంది. ఒక సీనియర్ హీరోతో చేయడం శృతికి ఇదే తొలిసారి. తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని అడగడంతో వెంటనే మరో ఆలోచన లేకుండా ఎస్ చెప్పేసింది ఈ భామ.

- Advertisement -

మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జనవరి నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే తెరకెక్కనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All