తెలుగులో పవన్ నటించిన `కాటమరాయుడు` తరువాత శృతీహాసన్ మరో చిత్రంలో కనిపించలేదు. ఆ తరువాత బాలీవుడ్లో `బెహెన్ హోగీ తెరీ` చిత్రంలో కనిపించింది. బోయ్‌ఫ్రెండ్ మైఖేల్ క్రోసల్తో డేటింగ్ చేసిన శృతి కెరీర్‌పై పెద్దగా దృష్టిపెట్టలేదు. అతనికి బ్రేకప్ చెప్పేసి తాజాగా మళ్లీ వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ అయిపోతోంది.
తెలుగులో మాస్ రాజా రవితేజ నటిస్తున్న `క్రాక్` చిత్రంతో రెండేళ్ల విరామం తరువాత మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. తమిళంలో విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న `లాభం` చిత్రంలోనూ నటిస్తున్న శృతి తాజాగా 33వ పుట్టిన రోజును జరుపుకుంది. అయితే అది ఇండియాలో మాత్రం కాదండోయ్ లండన్‌లో. తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి బర్త్‌డే వేడుకల్ని జరుపుకుంది.
ఈ సందర్భంగా శృతి షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియా ఇన్‌స్టాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో లండన్ వీధుల్లో తిరుగుతూ శృతి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ స్థాయిలో డ్యాన్స్ చేస్తూ పుట్టిన రోజు వేడుకల్ని ఎంజాయ్ చేయడం ఆనందంగా వుందని, లండన్‌లో తనకు బెస్ట్ ఫ్రెండ్స్ వున్నారని, అలాంటి ఫ్రెండ్స్ లభించడం తన అదృష్టమని ఈ సందర్భంగా శృతిహాసన్ వెల్లడించింది.