Homeటాప్ స్టోరీస్శ్రియ మళ్ళీ పుంజుకుంటోంది!

శ్రియ మళ్ళీ పుంజుకుంటోంది!

శ్రియ మళ్ళీ పుంజుకుంటోంది!
శ్రియ మళ్ళీ పుంజుకుంటోంది!

సాధారణంగా హీరోయిన్లకు దశాబ్ద కాలం లైఫ్ టైమ్ ఉంటుంది. అసలు ఒక హీరోయిన్ ఐదేళ్లు రాణిస్తేనే ఎక్కువనే రోజులివి. రెండు, మూడు సినిమాలకే చాలా మంది ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. ఇక పదేళ్లు ఒక హీరోయిన్ రాణించిందంటే ఆమె టాప్ హీరోయిన్ గా అప్పటికే చలామణీలో ఉన్నట్లు అర్ధం. ఆ తర్వాత ఆమెకు నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోతాయి. హీరోయిన్ అవకాశాలు పోవడంతో ఆమె కొన్నాళ్ళు బ్రేక్ తీసుకోవడం తర్వాత కొన్నేళ్లు బ్రేక్ ఇచ్చి వదిన, అక్క పాత్రలకు షిఫ్ట్ అవ్వడం ఆపై అమ్మ, అత్త పాత్రలతో సెటిలైపోవడం. ఒక పూర్తి స్థాయి సక్సెస్ ఫుల్ హీరోయిన్ కెరీర్ కు సంబంధించిన టెంప్లేట్ ఈ విధంగా ఉంటుంది. కానీ ఒక హీరోయిన్ రెండు దశాబ్దాలు కావొస్తున్నా ఇంకా హీరోయిన్ గానే అవకాశాలు దక్కించుకుంటోందంటే అర్థమేంటి? కెరీర్ మొదట్లో తన గ్లామర్ తో అప్పటి యువకుల మనసులకు గేలమేసిన ఆ హీరోయిన్, ఇరవై ఏళ్ళు కావొస్తున్నా కూడా అదే గ్లామర్ తో ఇప్పటి యువకులను పిచ్చేక్కిస్తోందంటే ఆమెను ఏమనాలి? ఇప్పటికే అర్ధమైందిగా మనం మాట్లాడుకుంటోంది శ్రియ శరన్ గురించెనని. కెరీర్ మొదట్లో గ్లామరస్ పాత్రలతో మెప్పించి దాదాపు అందరు టాప్ హీరోల సరసన ఆడిపాడేసింది శ్రియ శరన్. కొన్నేళ్ళకు ఆమెకు నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి. దాంతో ఇక ఆమె పనైపోయింది అనుకున్నారు.

కానీ అలా అనుకున్న ప్రతిసారి ఆమె బౌన్స్ బ్యాక్ అయింది. ఇప్పటికీ అవకాశాలను దక్కించుకుంటూనే ఉంది. కొన్నేళ్ల నుండి సీనియర్ హీరోల సరసన నటిస్తోంది శ్రియ. బాలకృష్ణతో పదిహేనేళ్ల క్రితం చెన్నకేశవ రెడ్డి సినిమాతో అలరించిన శ్రియ రీసెంట్ గా బాలయ్యతోనే గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాలు చేసింది. వెంకటేష్ తో దృశ్యం సినిమాలో నటించింది. పెళ్లి తర్వాతైనా ఆమెకు అవకాశాలు ఇక రావు అనుకున్నారు విశ్లేషకులు. కానీ ఆమెకు ఏదొక ఆఫర్ వస్తూ ఆమెను బిజీగా ఉంచుతోంది. ఇప్పుడు వెంకటేష్ నటించనున్న అసురన్ రీమేక్ లో శ్రియను తీసుకుందామని అనుకుంటున్నారు. కథ ప్రకారం మిడ్ ఏజ్ లో ఉన్న హీరోయిన్ కావాలి. ముందు నయన్ ను అనుకున్నారు. కానీ ఆమె బాగా కాస్ట్లీ, పైగా ప్రమోషన్స్ కు అస్సలు రాదు. ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తామని చెప్పినా కూడా నయన్ నో అనే అంటుంది. ఇటీవలే సైరా సినిమాకు ఏం జరిగిందో మనం చూసాం. అందుకనే శ్రియ అయితే బెస్ట్ అని సురేష్ బాబు అనుకుంటున్నాడు.

- Advertisement -

సీనియర్ హీరోలకు ఇప్పుడు హీరోయిన్ల కొరత తీవ్రంగా ఉంది. కాజల్, తమన్నా, నయన్ లాంటి వాళ్ళు సీనియర్ హీరోలు అనగానే భారీగా డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఇప్పటికీ త్రిష, శ్రియ లాంటి వాళ్లకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. త్రిష కూడా శ్రియ లాగే ఎంత సీనియర్ అయిపోయినా ఇప్పటికీ నటిస్తూనే ఉంది. మరోవైపు శ్రియ నటించిన సినిమాలు నరకాసురన్, తడ్కా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి అసురన్ రీమేక్ లో శ్రియనే ఫైనల్ చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All