Homeటాప్ స్టోరీస్ఫొటోస్టోరీ: `సాహో` సుంద‌రి అల్ట్రా మోడ్ర‌న్ లుక్ అదిరింది!

ఫొటోస్టోరీ: `సాహో` సుంద‌రి అల్ట్రా మోడ్ర‌న్ లుక్ అదిరింది!

ఫొటోస్టోరీ: `సాహో` సుంద‌రి అల్ట్రా మోడ్ర‌న్ లుక్ అదిరింది!
ఫొటోస్టోరీ: `సాహో` సుంద‌రి అల్ట్రా మోడ్ర‌న్ లుక్ అదిరింది!

ప్ర‌భాస్ న‌టించిన `సాహో` చిత్రంలో `ఆగ‌డిక స‌య్యే సైకో..` అంటూ చిందులేసి ర‌చ్చ చేసింది బాలీవుడ్ సోయ‌గం శ్ర‌ద్ధాక‌పూర్‌. ఈ సినిమా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ సాధించ‌క‌పోయినా శ్ర‌ద్ధాకు మాత్రం మంచి క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. `బాహుబ‌లి` స్టార్ తో క‌లిసి న‌టించిన న‌టిగా దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీనే సొంతం చేసుకుంది. ఈ క్రేజ్‌తో శ్ర‌ద్దా క‌పూర్ న‌టిస్తున్న తాజా చిత్రం `స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3డీ`. ఎబీసీడీ, ఎబీసీడీ 2 చిత్రాల త‌రువాత క్రేజీ బాలీవుడ్ డ్యాన్స‌ర్ రెమో డిసౌజా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

వ‌రుణ్‌ధావ‌న్‌, ప్ర‌భుదేవా, నోరా ఫ‌తే, పునీత్ పాత‌క్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా కీ రోల్ పోషిస్టోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లే పూర్తయింది. ఈ చిత్రంలో శ్ర‌ద్ధా ఆల్ట్రా మోడ్ర‌న్ స్టైల్లో క‌నిపించ‌బోతోంది. ఇందుకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను శ్ర‌ద్ధా సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసింది. స్టైలిష్ లుక్‌లో కేక పుట్టిస్తున్న శ్ర‌ద్ధా లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. `కీప్‌ద ఫైర్ బ‌ర్నింగ్ స‌మ‌రం మరో ఆరు అడుగుల దూరంలో వుంది. స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3డీ టీజ‌ర్ ఈ నెల 18న బ‌య‌టికి రాబోతోంది` అని ట్విట్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

- Advertisement -

హీరో వ‌రుణ్‌ ధావ‌న్ కూడా త‌న ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని షేర్ చేశాడు. భూమ్‌, ఎస్‌డి3, స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3 పేరుతో హాష్ ట్యాగ్‌లు పెట్టాడు. ట్రైల‌ర్ వ‌చ్చేస్తోంది. నిద్ర‌లేని రాత్రుల‌కు తెర‌ప‌డ‌బోతోంది` అని ట్విట్ట‌ర్ వేదిక‌గా రాసుకొచ్చాడు. ఈ చిత్రాన్ని అమృత్‌స‌ర్, లండ‌న్‌, ముంబై, దుబాయ్‌లో చిత్రీక‌రించారు. టీ సిరీస్ సంస్థపై భూష‌ణ్‌కుమార్, క్రిష‌న్ కుమార్, లీజ‌లే డిసౌజా నిర్మిస్తున్న ఈ సినిమా జ‌న‌వ‌రి 24న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్‌కానుంది.

Credit: Instagram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All