
ఓ పరాజితుడి విజయగాథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం `జెర్సీ`. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ చిత్రం ద్వారా కన్నడ సుందరి శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగులో నటించిన తొలి చిత్రంతో టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా ప్రశంసలతో పాటు పలు ఆఫర్లని సొంతం చేసుకుంది. ప్రస్తుతం విశాల్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం `చక్ర`లో నటిస్తోంది. త్వరలో ఈ మూవీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
తాజాగా ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని అంగీకరించింది. ఆమె నటిస్తున్న ద్విభాషా చిత్రం `కలియుగం`. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రమోద్ సుందర్ దర్శకుడు. 2050 టైమ్ పిరియడ్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందబోతోంది. 30 ఏళ్ల తరువాత ఈ కలియుగం ఎలా వుంటుందన్న ఊహ నేపథ్యంలో దర్శకుడు ఈ చిత్రాన్ని ఊహకందని ట్విస్ట్‌లతో తెరపైకి తీసుకురాబోతున్నారు.
వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందట. అత్యధిక భాగం చెన్నైలో చిత్రీకరణ జరపనున్నారు. ఆర్కే ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రం శ్రద్ధా శ్రీనాథ్ కెరీర్‌లో మర్చిపోలేని మూవీ కానుందట. ఇదే విషయాన్ని శ్రద్ధా శ్రీనాథ్ వక్తం చేసింది.
New project alert: Kaliyugam. Nothing like you’ve seen before. So excited to even start preparing for this. pic.twitter.com/xXZq2fPukj
— Shraddha Srinath (@ShraddhaSrinath) November 6, 2020