Homeటాప్ స్టోరీస్కోలీవుడ్‌కు వెళుతున్న శివాత్మిక‌!

కోలీవుడ్‌కు వెళుతున్న శివాత్మిక‌!

కోలీవుడ్‌కు వెళుతున్న శివాత్మిక‌!
కోలీవుడ్‌కు వెళుతున్న శివాత్మిక‌!

ప్ర‌స్తుతం స్టార్స్ అంతా స్పీడు పెంచారు. ఏడాది ఒక్క సినిమాతో ఆక‌ట్టుకునే స్టార్స్ క‌రోనా పుణ్య‌మా అని ఒకేసారి మూడు నాలుగు చిత్రాల్లో న‌టిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. గ‌తంలో ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడూ క‌నిపించ‌లేదు. దీంతో ఫ్యాన్స్ సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోన‌వుతున్నారు. ప్ర‌భాస్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్ నుంచి నాని వ‌ర‌కు అంతా మూడు నాలుగు ప్రాజెక్ట్‌లు చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.

అప్ క‌మింగ్ స్టార్స్ కూడా ఇదే త‌ర‌హాలో ఒకేసారి మూడు నాలుగు చిత్రాల్లో న‌టించేస్తూ కేరీర్‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో డా. రాజ‌శేఖ‌ర్ చిన్న కుమార్తె శివాత్మిక చేరింది. `దొర‌సాని` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం క్రియేటీవ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న `రంగ‌మార్తాండ‌` చిత్రంలో న‌టిస్తోంది.

- Advertisement -

ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుండ‌గానే శివాత్మిక త‌మిళ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. హీరో కార్తీక్ త‌న‌యుడు గౌత‌మ్ కార్తీక్ హీరోగా రూపొందనున్న ఓ త‌మిళ చిత్రంలో శివాత్మిక హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది. ఈ చిత్రానికి నంద పెరియ‌సామి ద‌ర్శ‌‌క‌త్వం విహించ‌నున్నారు. ఈ విష‌యాన్ని శివాత్మిక ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All