
హీరో రాజశేఖర్ కూతురు శివాని .. తాజాగా ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో పాల్గొననున్నట్లు తెలిపి ఆశ్చర్య పరిచింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘నేను కొత్త సాహసం చేస్తున్నాను. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మిస్ ఇండియా ఆర్గనైజేషన్‌కు ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించండి. ఆల్ ది బెస్ట్ టు ది లవ్‌లీ లేడీస్’ అంటూ రాసుకొచ్చింది.
శివాని ఏపీనుండి పాల్గొని టాప్ 8 ఫైనలిస్టులో ఉంది. తాను ఎనిమిదో స్థానంలో నిలిచినట్లు ఇన్‌స్టాలో వెల్లడించింది. శివాని రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించగా.. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించిన వారు కూడా ఈ ఫైనలిస్టులో ఉన్నారు. ఇక శివాని సినిమాల విషయానికి వస్తే..2021లో తేజ సజ్జా సరసన అద్భుతం చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచమైంది.