
కరోనా క్రైసిస్ కారణంగా చాలా మంది సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది తిండి కూడా దొరకక్క ఇబ్బంది పడుతున్నారు. వారిని కాపాడటం కోసం సీఎం సహాయ నిధికి చాలా మంది విరాళాలు ప్రకటిస్తున్నారు. డా. రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక 2 లక్షలు విరాళం అందించారు.
యాంగ్రీ యంగ్‌మెన్ డా. రాజశేఖర్ చిన్న కుమార్తె, `దొరసాని` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన శివాత్మిక పుట్టిన రోజు నేడు (ఏప్రిల్ 22). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శివాత్మిక తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలు విరాళంగా అందించారు. అలాగే రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని మరో అక్ష విరాళాన్ని అందించారు.
ఈ ఇద్కదరు అక్కా చెల్లెళ్లు బుధవారం ప్రగతి భవన్‌కి వెళ్లి ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌కు చెక్కుల్ని అందజేశారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో సమావేశమైన శివాని, శివాత్మిక కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని కొనియాడారు. మా వంతు సహాయం చేయాలని ముందు కొచ్చామని, ప్రభుత్వ ఆదేశాలను అంతా పాటించి ఇంటి పట్టునే వుండాలని ఈ సందర్భంగా శివాని, శివాత్మిక ప్రజలకి సూచించారు.
.@ActorRajasekhar‘s Daughters @Rshivani_1 @ShivathmikaR Contributes Rs 2 Lakhs for Telangana CM Relief fund to fight #CoronavirusPandemic @TelanganaCMO @KTRTRS#LetsFightCoronaTogether #StayHome #StaySafe pic.twitter.com/8X1pHdDPvF
— BARaju (@baraju_SuperHit) April 22, 2020
Credit: Twitter