Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన శివాజీ

పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన శివాజీ

shivaji fire on pawankalyan జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు హీరో శివాజీ . కొద్దిరోజుల క్రితం వరకు పవన్ కళ్యాణ్ అంటే శివాజీ కి ప్రత్యేకమైన అభిమానం ఉండేది కానీ జనసేన నాల్గవ వార్షికోత్సవ సభలో తెలుగుదేశం పార్టీ పై అలాగే చంద్రబాబు , లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో అవాక్కయిన శివాజీ ప్రశ్నించడం మీకే కాదు మాకు వచ్చు అంటూ పవన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు .

ప్రధానమంత్రి ని ఎందుకు విమర్శించడం లేదు ? ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన బిజెపి ని , ప్రధాని ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందా ? లేదా ? మరి అలాంటప్పుడు ప్రధాని ని ప్రశ్నించకుండా లోకేష్ పై ఆరోపణలు చేయడం ఏంటి ? అతడి పై చేసిన ఆరోపణలకు అధరాలు ఉన్నాయని చెప్పిన పవన్ ఆ తర్వాత మాట మార్చి బయట అనుకుంటున్నారు కాబట్టి నేను అన్నాను అని చెప్పడం ఏంటి ? ఒక రాజకీయ నాయకుడి కి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా పవన్ కు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు శివాజీ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All