Homeటాప్ స్టోరీస్ప్లాప్ డైరెక్టర్ తో రిస్క్ చేస్తున్న శర్వానంద్

ప్లాప్ డైరెక్టర్ తో రిస్క్ చేస్తున్న శర్వానంద్

Sharwanand next with flop directorశర్వానంద్ హీరోగా మంచి విజయాలు సాధిస్తూ రేసులో దూసుకుపోతున్నాడు కాగా ఈ సమయంలో వరుసగా ప్లాప్ దర్శకులతో సినిమాలను అంగీకరించి అందరికీ షాక్ ఇస్తున్నాడు . ఇప్పటికే ”లై ” అనే డిజాస్టర్ ఇచ్చిన హను రాఘవపూడి దర్శకత్వంలో పడిపడి లేచే మనసు చిత్రం చేస్తుండగా తాజాగా మహేష్ బాబుతో అతిపెద్ద డిజాస్టర్ బ్రహ్మోత్సవం ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ! దసరా పండగ సందర్బంగా ఆ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు తెలుస్తోంది ఇక ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించనున్నారు .

మహేష్ బాబు- వెంకటేష్ లతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత ఆ స్థాయి చిత్రాలను తీయలేకపోయాడు . ముకుంద తీయగా అది ప్లాప్ అయ్యింది అలాగే బ్రహ్మోత్సవం అయితే మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత చెత్త చిత్రంగా రికార్డ్ సృష్టించింది . దాంతో శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేయడానికి ఏ హీరో కూడా సాహసం చేయలేకపోయారు ఇక అప్పటినుండి ఈ దర్శకుడు ఖాళీగానే ఉన్నాడు . కట్ చేస్తే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా కనుక ఎంతో కొంత మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది కాబట్టి శర్వానంద్ సాహసం చేస్తున్నట్లున్నాడు .

- Advertisement -

English Title: Sharwanand next with flop director

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All