Homeటాప్ స్టోరీస్బాలీవుడ్ వాళ్ళకి మన సినిమాలు కావాలి అలాగే మన దర్శకులు కూడా కావాలి

బాలీవుడ్ వాళ్ళకి మన సినిమాలు కావాలి అలాగే మన దర్శకులు కూడా కావాలి

బాలీవుడ్ వాళ్ళకి మన సినిమాలు కావాలి అలాగే మన దర్శకులు కూడా కావాలి
బాలీవుడ్ వాళ్ళకి మన సినిమాలు కావాలి అలాగే మన దర్శకులు కూడా కావాలి

సినిమా పరిశ్రమలో మన తెలుగు, తమిళ పరిశ్రమలు ఒకలాగా ఉంటాయి. అలాగే కన్నడ, హిందీ పరిశ్రమలు ఒకలాగ ఉంటాయి. ఆలోచించే తీరు, చేసే సినిమాలు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. అయితే మన తెలుగు,తమిళ సినిమాలు ఒక్కొక్కటిగా ఆకాశాన్నంటే విజయాలు దక్కుతున్నాయని మన సినిమాల మీద, దర్శకుల మీద కన్నువేశారు హిందీ సినిమాల పరిశ్రమ వాళ్ళు.

మన తెలుగు, తమిళ సినిమాలు హిట్ అయిన వెంటనే రీమేక్ హక్కులు కొనెయ్యడం, సినిమాని వాళ్ళకి నచ్చినట్టుగా కొన్ని సన్నివేశాలని మార్చి హిట్లు కొట్టేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాని అలానే చేసి బంపర్ హిట్ కొట్టేశారు. ఇప్పుడు నాని నటించిన ‘జెర్సీ’ సినిమాని కూడా రీమేక్ హక్కుల్ని కొనేసి సినిమాని తియ్యాలని ప్లాన్ వేస్తున్నారు. ఆ జెర్సీ హిందీ నిర్మాతల్లో మన తెలుగు నిర్మాత ‘అల్లు అరవింద్’ గారు కూడా ఉన్నారు.

- Advertisement -

గత కొంతకాలంగా హిట్ అనే సినిమాకి దూరంగా ఉన్న కింగ్ ఖాన్ ‘షారుక్ ఖాన్‘ కన్ను కూడా మన తెలుగు, తమిళ దర్శకుల మీద అలాగే కథల మీద కూడా పడింది. అందరిని వెతుక్కుంటూ చివరికి ‘పోలీసోడు’, ‘అదిరింది’, ‘రాజా రాణి’ సినిమాల దర్శకులు ‘అట్లీ’ కి ఛాన్స్ ఇచ్చారు. ఒకప్పుడు షారుఖ్ ఖాన్ సినిమాలు అంటే యువతరం, ఫ్యామిలీ ఆడియోన్స్ ఎగపడి చూసే వారు. ఇప్పుడు గత కొంతకాలంగా వరుసగా 4 ఫ్లాప్ లు వచ్చేసరికి కథల ఎంపికల మీద ద్రుష్టి పెట్టి కొత్తగా చేద్దాం అని మన అట్లీ గారికి అవకాశం ఇచ్చారు.

అట్లీ కొత్త సినిమా ‘విజిల్ (బిగిల్)’ దీపావళికి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.ఇళయ దళపతి విజయ్ కథనాయకుడు. వీరి కాంబినేషన్లో రాబోతున్న మూడవ సినిమా ఇది. డిసెంబర్ నుండి షారుఖ్ ఖాన్ – అట్లీ కొత్త సినిమా పట్టాలెక్కబోతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All