Homeటాప్ స్టోరీస్సినిమా ప్రకటించకుంటే చనిపోతాడట

సినిమా ప్రకటించకుంటే చనిపోతాడట

సినిమా ప్రకటించకుంటే చనిపోతాడట
సినిమా ప్రకటించకుంటే చనిపోతాడట

అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా అభిమానులు వెనుకాడరు. అలాంటి అభిమానికే హీరోపై కోపం వస్తే అతను ఆడుకునే ఆట మామూలుగా వుండదు. ఇదే విషయాన్ని ప్రధానంగా తీసుకుని కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా `ఫ్యాన్` సినిమా వచ్చిన విషయం తెలిసిందే.  వెండితెరపై అభిమాని కారణంగా ఇబ్బందులు పడ్డ షారుఖ్ రియల్ లైఫ్ లోనూ అదే తరహా ఇబ్బందుల్లో ఇరుక్కో బోతున్నారు.

వివరాల్లోకి వెళితే… షారుఖ్ ఖాన్ నటించిన చిత్రాలేవీ ఈ మధ్య కాలంలో ఆశించిన విజయాల్ని దక్కించుకోలేకపోయాయి. ఆనంద్ ఎల్ రాయ్ తో కలిసి చేసిన `జీరో` బాక్సాఫీస్ వద్ద పేరుకు తగ్గట్టే జీరో ఫలితాన్ని అందించి కింగ్ ఖాన్ కెరీర్లోనే అత్యంత భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆదెబ్బతో కంగుతిన్న షారుఖ్ ప్రేక్షకుల్లో వచ్చిన మార్పుకు తగ్గట్టుగా ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందా అని తర్జన భర్జన పడుతూ ఇంత వరకు ఏ ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు. దీంతో షారుఖ్ అభిమానుల్లో అసహనం పెరిగిపోతోంది.

ఈ విరామాన్ని తట్టుకోలేని ఓ అభిమాని ఏకంగా షారుఖ్ కు ఆల్టిమేటమ్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘షారుఖ్ సర్ ఇప్పటి వరకు మీరు తీసుకున్న బ్రేక్ చాలు. ‘జీరో’ సినిమా తరువాత నుంచి నేను ఏ సినిమా చూడలేదు. ఎందుకంటే మీ నుంచి మరో సినిమా రాలేదు కాబట్టి. కొత్త సంవత్సరమైనా మీ నుంచి గుడ్ న్యూస్ వస్తుందని ఆశిస్తున్నాను’ అని ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తే మరో అభిమాని చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. `కొత్త సంవత్సరంలో కొత్త సినిమా ప్రకటన చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని` ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది. దీనిపై షారుఖ్ స్పందించాల్సి వుంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All