Homeటాప్ స్టోరీస్శంభో శంకర రివ్యూ

శంభో శంకర రివ్యూ

shambho shankara reviewశంభో శంకర రివ్యూ :
నటీనటులు : షకలక శంకర్ , కారుణ్య చౌదరి
సంగీతం : సాయి కార్తీక్
నిర్మాతలు : రమణారెడ్డి – సురేష్ కొండేటి
దర్శకత్వం : శ్రీధర్ . ఎన్
రేటింగ్ : 3 / 5
రిలీజ్ డేట్ : 29 జూన్ 2018

హాస్య నటుడు షకలక శంకర్ హీరోగా నటించిన చిత్రం ” శంభో శంకర ” . ఎన్ . శ్రీధర్ దర్శకత్వంలో రమణారెడ్డి – సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

- Advertisement -

కడప జిల్లా అంకాలమ్మ పల్లె ప్రెసిడెంట్ (అజయ్ ఘోష్ ) చేస్తున్న అక్రమాలను అడ్డుకోవడానికి పోలీస్ ట్రైనింగ్ కి వెళ్తాడు శంకర్ ( షకలక శంకర్ ). అయితే ఫిజికల్ టెస్ట్ లో పాసైనప్పటికీ కావాలనే శంకర్ ని పోలీస్ కాకుండా కుట్ర తో అడ్డుకుంటారు . 50 ఏళ్లుగా అంకాలమ్మ పల్లె ని ఏలుతున్న ప్రెసిడెంట్ కొడుకు శంకర్ చెల్లెలు ని ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసి చంపేస్తాడు . దాంతో ప్రెసిడెంట్ కొడుకు ని చంపేస్తాడు శంకర్ . అయితే శంకర్ పై ఎలాంటి కేసు లేకుండా చేయడమే కాకుండా అతడికి ప్రత్యేక అధికారాలు ఇస్తూ అంకాలమ్మ పల్లె లో ఎలాంటి అన్యాయాలు జరుగకుండా చేయమని ఆదేశిస్తాడు కడప ఎస్పీ . ప్రెసిడెంట్ కి ముకుతాడు వేసినప్పటికీ ఆ గ్రామంలో జరుగుతున్న అన్యాయాలకు వెనుక ఎవరో ఉన్నారని తెలుసుకుంటాడు శంకర్ . అసలు శంకర్ ని పోలీస్ కాకుండా అడ్డుకున్నది ఎవరు ? ఎందుకు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

శంకర్ నటన
డైలాగ్స్

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

కమెడియన్ గా అందరికీ సుపరిచుతుడైన శంకర్ లో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా ? అని షాక్ అవ్వడం ఖాయం ఎందుకంటే యాక్టింగ్ తోనే కాకుండా ఫైట్స్ లో అదరగొట్టాడు అలాగే డ్యాన్స్ లలో కూడా . ఓ స్టార్ హీరో మాదిరి చెలరేగిపోయాడు శంకర్ శంకర్ పాత్రలో . వన్ మాన్ ఆర్మీ ని తలపించాడు . హీరోయిన్ కారుణ్య చౌదరి ఫరవాలేదు కానీ ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకుండాపోయింది . ఇక విలన్ గా అజయ్ ఘోష్ మెప్పించాడు . ఇక మిగిలిన పాత్రల్లో నాగినీడు , ప్రభు , రవి ప్రకాష్ తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు . ఫిలిం జర్నలిస్ట్ గా సుదీర్ఘమైన కెరీర్ సాగిస్తూ అందరికీ తల్లో నాలుకలా ఉన్న సురేష్ కొండేటి కలెక్టర్ పాత్ర పోషించడం విశేషం .

సాంకేతిక వర్గం :

సాయి కార్తీక్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . పాటలు అలాగే రీ రికార్డింగ్ తో అలరించాడు సాయి కార్తీక్ .సినిమాటో గ్రఫీ బాగుంది , రమణారెడ్డి – సురేష్ కొండేటి నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు శ్రీధర్ విషయానికి వస్తే …… శంకర్ ని ఓ స్టార్ హీరో రేంజ్ లో చూపించాలనే సాహసేపేతమైన ప్రయత్నం చేసాడు . కొంతవరకు ఆకట్టుకున్నాడు కూడా అయితే స్క్రీన్ ప్లే పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఖచ్చితంగా మరోలా ఉండేది . రైతుల సమస్యలను టచ్ చేసి మెప్పించాడు .

English Title: shambho shankara review

                   Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All