Homeన్యూస్శాకిని డాకిని చూపు కూడా ఓటిటి వైపే!!

శాకిని డాకిని చూపు కూడా ఓటిటి వైపే!!

శాకిని డాకిని చూపు కూడా ఓటిటి వైపే!!
శాకిని డాకిని చూపు కూడా ఓటిటి వైపే!!

కొరియన్ యాక్షన్ డ్రామా మిడ్ నైట్ రన్నర్స్ చిత్రాన్ని తెలుగులో శాకిని డాకినిగా రీమేక్ అయింది. స్వామి రారా, కేశవ, రణరంగం ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. చాలా కామ్ గా ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. చాలా తక్కువ సమయంలో పూర్తయిపోయింది కూడా. శాకిని డాకిని ఫస్ట్ లుక్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. పేరున్న నటీమణులు రెజీనా కాసాండ్రా, నివేతా థామస్ ఈ చిత్రంలో టైటిల్ పాత్రలు పోషించారు.

ఈ చిత్ర విడుదల ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సందర్భంలో నిర్మాత సురేష్ బాబు దీనిపై క్లారిటీ ఇచ్చాడు. సునీతా తాటితో కలిసి సురేష్ బాబు శాకిని డాకినిలను నిర్మించాడు. ఈ చిత్రాన్ని ఓటిటికి అమ్మినట్లు తాజాగా నిర్మాత సురేష్ బాబు ప్రకటించాడు. దాంతో పాటు తమ నిర్మాణంలో రూపొందుతోన్న దొంగలున్నారు జాగ్రత్త, డ్యాన్సింగ్ క్వీన్ చిత్రాలను కూడా ఓటిటి ప్లాట్ ఫామ్స్ కు అమ్మేసినట్లు సురేష్ బాబు తెలిపాడు.

- Advertisement -

“ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సామాన్య జనాలు థియేటర్లకు రావడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. కేవలం పెద్ద సినిమాలకు లేదా పండగలకు మాత్రమే థియేటర్ల మొహం చూస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని సురేష్ బాబు తెలిపాడు.

ఇవి కూడా చదవండి:

నివేతా, రెజీనా లీడ్ రోల్ లో శాకిని డాకిని

రెజీనా సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుందా ?

లెస్బియన్ గా హిట్ కొట్టిన రెజీనా

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All