Homeటాప్ స్టోరీస్శంభో శంకర బ్లాక్ బస్టర్ అవుతుందా ?

శంభో శంకర బ్లాక్ బస్టర్ అవుతుందా ?

shakalaka shankar hopes on shambo shankara జబర్దస్త్ తో వెలుగులోకి వచ్చిన హాస్య నటుడు షకలక శంకర్ . జబర్దస్త్ తర్వాత షకలక శంకర్ పలు చిత్రాల్లో నటించాడు అయితే ఆ పాత్రలేవీ అతడికి సంతృప్తి ని అందించలేకపోయాయి దాంతో తన మిత్రుడు శ్రీధర్ తో కలిసి శంభో శంకర కథ ని రెడీ చేసుకోవడమే కాకుండా హీరోగా నటించాడు . ఓ స్టార్ హీరో రేంజ్ లో షకలక శంకర్ ని చూపించాడట శ్రీధర్ దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాడు శంకర్ . టీజర్ , ట్రైలర్ చూస్తుంటే శంభో శంకర సినిమా హిట్ అయ్యే లాగే కనిపిస్తోంది .

అయితే హిట్ అవుతుందా ? బ్లాక్ బస్టర్ అవుతుందా ? అన్నది మాత్రం ఈరోజు తేలిపోనుంది . ఈరోజున శంభో శంకర సినిమా విడుదల అవుతోంది ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు షకలక శంకర్ . హీరోగా నటిస్తున్న సినిమా కాబట్టి ఇంకా వత్తిడి కూడా బాగానే ఉందట . శ్రీధర్ కి దర్శకుడిగా మొదటి సినిమా అలాగే శంకర్ కు హీరోగా మొదటి సినిమా దాంతో ఈ సినిమా హిట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు .

- Advertisement -

ఈ సినిమాని నిర్మించింది నెల్లూరు కి చెందిన రమణారెడ్డి నిర్మించగా ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కొండేటి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు . రమణారెడ్డి తో పాటుగా సురేష్ కొండేటి కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు . శంభో శంకర బ్లాక్ బస్టర్ అయితే ఆ చిత్ర బృందం సంతోషానికి అవధులే ఉండవు . పైగా ఈ సినిమా పెద్ద హిట్ అయి బాగా డబ్బులు వస్తే శంకర్ – శ్రీధర్ లు సొంత ఇల్లులు కొనుక్కుంటారట .

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All