Homeన్యూస్పూర్తిగా తారుమారైన షారుఖ్ ఖాన్ షూటింగ్ షెడ్యూల్స్

పూర్తిగా తారుమారైన షారుఖ్ ఖాన్ షూటింగ్ షెడ్యూల్స్

పూర్తిగా తారుమారైన షారుఖ్ ఖాన్ షూటింగ్ షెడ్యూల్స్
పూర్తిగా తారుమారైన షారుఖ్ ఖాన్ షూటింగ్ షెడ్యూల్స్

కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గత కొన్నేళ్లుగా కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. షారుఖ్ నుండి సూపర్ హిట్ వచ్చి చాలా కాలమైంది. ఈ స్టార్ హీరో నటించిన రీసెంట్ సినిమాలు అన్నీ కూడా ప్లాపులుగా మిగిలాయి. దీంతో కింగ్ ఖాన్ మార్కెట్ పూర్తిగా డల్ అయింది. మరోవైపు మిగిలిన ఖాన్స్, బాలీవుడ్ స్టార్ హీరోల మార్కెట్స్ 200 కోట్లు, 300 కోట్లు అంటూ పెరిగిపోయాయి.

అయితే కెరీర్ పరంగా పుంజుకోవడానికి కొంత బ్రేక్ తీసుకున్నాడు. దాదాపు మూడేళ్ళ విరామం తీసుకున్న షారుఖ్, వరసగా రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి పఠాన్ కాగా మరొకటి సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలోది. సజావుగా సాగుతోన్న ఈ రెండు చిత్రాల షూటింగ్స్ కు ఇప్పుడు తీవ్ర అంతరాయం కలిగింది. షెడ్యూల్స్ అన్నీ కూడా తారుమారైయ్యాయి.

- Advertisement -

పూణేలో అట్లీ చిత్ర షూటింగ్ ను రెండు వారాలు చేసాక తన కొడుకు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసినట్లు తెలిసింది. వెంటనే షూటింగ్ ను రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నాడు షారుఖ్. అయితే ఆర్యన్ అరెస్ట్ అయి నెల రోజులు గడిచినా కూడా ఇంకా బెయిల్ కూడా రాలేదు. దీంతో బాగా డిస్టర్బ్ అయిన షారుఖ్ తన షూటింగ్ ప్లాన్స్ అన్నీ రద్దు చేసుకుని కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలతో పాటు షారుఖ్ పలు బ్రాండ్స్ షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All