Homeన్యూస్ఆర్ధర్ రోడ్ జైలులో కొడుకుని కలిసిన షారుఖ్

ఆర్ధర్ రోడ్ జైలులో కొడుకుని కలిసిన షారుఖ్

ఆర్ధర్ రోడ్ జైలులో కొడుకుని కలిసిన షారుఖ్
ఆర్ధర్ రోడ్ జైలులో కొడుకుని కలిసిన షారుఖ్

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెల్సిందే. పలు మార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా అది రిజక్ట్ అయింది. ఈ నేపథ్యంలో తనయుడిని చూడటానికి షారుఖ్ జైలుకి వచ్చాడు. ముంబైలోని ఆర్ధర్ రోడ్డు జైలుకి విచ్చేశాడు. కొడుకుతో కాసేపు మాట్లాడి తిరిగి వెళ్ళిపోయాడు.

ఆర్యన్ ఖాన్ అరెస్టైన తర్వాత షారుఖ్ కొడుకుని కలవడం ఇదే తొలిసారి. అక్టోబర్ 2న డ్రగ్స్ తీసుకున్నాడన్న నేపథ్యంలో ఇంకా మరికొన్ని కేసుల్లో ఆర్యన్ ఖాన్ ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు బెయిల్ నిరాకరణ చేసింది ప్రత్యేక న్యాయస్థానం. నిన్న కూడా బెయిల్ నిరాకరణ జరిగింది. ఇప్పటిదాకా కొడుకుకి బెయిల్ వస్తుందని ఎదురుచూసిన షారుఖ్ మరోసారి బెయిల్ అభ్యర్ధనను తోసిపుచ్చడంతో ఇవాళ జైలుకు వచ్చారు.

- Advertisement -

ఇప్పటిదాకా కోవిడ్ నిబంధనల నేపథ్యంలో జైల్లో ఉన్నవారిని బయటివారు కలిసే అవకాశం లేదు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడంతో నిబంధనలను సడలించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇక గతవారం ఆర్యన్ తన తల్లిదండ్రులతో వీడియో కాల్ లో మాట్లాడిన విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All