
తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ `అర్జున్‌రెడ్డి` రీమేక్ `కబీర్‌సింగ్`తో షాహీద్ కపూర్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. రెండంకెల లోపు రెమ్యునరేషన్ తీసుకునే ఈ హీరో ఇప్పుడు భారీ స్థాయిలో డిమాండ్ చేస్తున్నాడు. ప్రస్తుతం షాహీద్ కపూర్ తెలుగు హిట్ ఫిల్మ్ `జెర్సీ` ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. `జెర్సీ` పేరుతో రీమేక్ అవుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా రీమేక్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి 33 కోట్లు పారితోషికంతో పాటు లాభాల్లో వాటా అనే ఒప్పందాన్ని చేసుకున్నారు షాహీద్ కపూర్. కోవిడ్‌కు ముందే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడంతో ఒప్పందం కూడా అప్పుడే జరిగింది. అయితే కోవిడ్ తరువాత సమీకరణలతో పాటు మూవ ఈ బడ్జెట్‌లలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో మేకర్స్ తన పారితోషికంలో కొంత కోత పెట్టుకోవాల్సిందేనని రిక్వెస్ట్ చేశారట.
దీంతో షాహీద్ తన పారితోషికం 33 కోట్లలో 8 కోట్లు తగ్గించుకున్నాడట. దీంతో అతని పారితోషికం 25 కోట్లకు తగ్గిపోయింది. అయితే ముందు అనుకున్నట్టుగా ప్రాఫిట్‌లలో మాత్రం షాహీద్ కపూర్‌కు వాటా ఇవ్వాల్సిందేనట. ఈ చిత్రం ద్వారా గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. అల్లు అరవింద్, దిల్ రాజుతో కలిసి బాలీవుడ్ ప్రొడ్యూసర్ అమన్ గిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.