Sunday, December 4, 2022
Homeటాప్ స్టోరీస్షాదీ ముబార‌క్ రివ్యూ

షాదీ ముబార‌క్ రివ్యూ

షాదీ ముబార‌క్ రివ్యూ
షాదీ ముబార‌క్ రివ్యూ

న‌టీన‌టులు: సాగ‌ర్ ఆర్‌.కె. నాయుడు‌, దృశ్య‌ ర‌ఘునాథ్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, బెన‌ర్జీ, హేమ‌, రాజ్ శ్రీ నాయ‌ర్‌, అదితీ మ‌యిక‌ల్‌, రామ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.
ద‌ర్శ‌క‌త్వం:  ప‌ద్మ‌శ్రీ‌
నిర్మాత‌లు:  దిల్ రాజు, శిరీష్‌
సంగీతం:  సునీల్ క‌శ్య‌ప్‌‌ ‌
సినిమాటోగ్ర‌ఫీ:  శ్రీ‌కాంత్ న‌రోజ్ ‌‌
ఎడిటింగ్: మ‌ధు చింత‌ల‌
రిలీజ్ డేట్: 05 – 03- 2021
రేటింగ్: 2.25/5

- Advertisement -

బుల్లితెర‌పై న‌టుడిగా ఆక‌ట్టుకున్న సాగ‌ర్ ఆర్‌.కె. నాయుడు వెండితెర‌పై హీరోగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నాడు. గ‌తంలో హీరోగా ఓ సినిమా చేసినా అది ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో కొంత విరామం తీసుకున్న సాగ‌ర్ తాజాగా ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఇప్ప‌టికే పాపుల‌ర్ అయిన `షాదీ ముబార‌క్‌` టైటిల్‌ని ఎంచుకుని వినోదాత్మ‌క ప్రేమ‌క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. దిల్ రాజు, శిరీష్‌లు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించిన ఈ మూవీ ఈ బ్యాన‌ర్‌కి త‌గ్గ‌ట్టే వుందా?  సాగ‌ర్‌కి విజ‌యాన్ని అందించిందా అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:
ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఎన్నారై సున్నిపెంట మాధ‌వ్ (సాగ‌ర్ ఆర్‌. కె. నాయుడు) పెళ్లి చూపుల కోసం  హైద‌రాబాద్ వ‌స్తాడు. ఒక్క రోజులో ముగ్గురు అమ్మాయిల్ని చూసేందుకు బ‌య‌లుదేర‌తాడు. ఇందు కోసం ఓ పెళ్లిళ్ల క‌న్స‌ల్టెన్సీని సంప్ర‌దిస్తాడు. వారు మూగ్గుర‌మ్మాయిల‌తో సున్నిపెంట మాధ‌వ్ కు పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. అయితే ఈ క్ర‌మంలో క‌న్స‌ల్టెంట్ కూతురు స‌త్య‌భామ‌(దృశ్య‌ ర‌ఘునాథ్‌)ని సున్నిపెంట మాధ‌వ్ తో పంపిస్తుంది.  ప్ర‌యాణంలో ఇద్ద‌రి మ‌ధ్ ముందు మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్తినా ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే ఈ క్ర‌మంలో సున్నిపెంట మాధ‌వ్ మూడ‌వ పెళ్లి కూతుర్ని ఫైన‌ల్ చేసుకుంటాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? స‌త్య‌భామ ప్రేమ ఎలా సుఖాంత‌మైంది అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల న‌ట‌న‌:
హీరో సాగ‌ర్ ఆర్‌.కె. నాయుడు  స్టైల్ అండ్ క్లాసీ లుక్‌లో ఆక‌ట్టుకున్నాడు. ఏదైనా చెప్ప‌డానికి మోహ‌మాట ప‌డే యువ‌కుడిగా త‌న దైన స్టైల్లో న‌టించి మెప్పించారు. సున్నిపెంట మాధ‌వ్ పాత్ర‌లో చాలా సెటిల్డ్‌గా న‌టించాడు. భావోద్వేగా స‌న్నివేశాల్లోనూ అల‌రించాడు. దృశ్య ర‌ఘునాథ్ పేరుకు స‌గ్గ‌ట్టే స‌త్య‌భామ పాత్ర‌లో ఒదిగిపోయింది. అల్ల‌రి, పొగ‌రుబోతు అమ్మాయిగా కొంత బోల్డ్‌గా న‌టించి ఆక‌ట్టుకుంది. రాహుల్ రామ‌కృష్ణ‌, భ‌ద్రం, హేమంత్ అక్క‌డ‌క్క‌డా న‌వ్వించారు. అజ‌య్‌ ఘోష్ త‌న పాత్ర ప‌రిధిమేర‌కు న‌టించారు.

సాంకేతిక వ‌ర్గం:
టెక్న‌క‌ల్ డిపార్ట్‌మెంట్‌లో చెప్పుకోవాల్సిన వ్య‌క్తి కెమెరామెన్ శ్రీ‌కాంత్ నరోజ్‌. విజువ‌ల్స్‌తో చ‌క్క‌ని ప‌నితీరుని క‌న‌బ‌రిచారు. త‌రువాత చెప్పుకోవాల్సిన వ్య‌క్తి సునీల్ క‌శ్య‌ప్‌. మ‌ధు చింత‌ల ఎడిటింగ్ మ‌రింత క్రిస్పీగా వుంటే బాగుండేది. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత‌లు దిల్ రాజు, శిరీష్ మ‌ధ్య‌లో ఎంట‌రైనా నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

తీర్పు:
`షాదీ ముబార‌క్` ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. పెళ్లి చూపుల నేప‌థ్యంలో అళ్లుకున్న క‌థ‌. ఊహించిన స్థాయిలో ట్రైల‌ర్‌లో చూపించిన విధంగా ఎంట‌ర్‌టైన్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. మ‌రింత‌గా ప్ర‌య‌త్నించి వుంటే ఫ‌లితం మ‌రోలా వుండేది. దిల్ రాజు నిర్మాణంలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి ఈ చిత్రం ఆ బ్యాన‌ర్‌లో వ‌చ్చిన కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల స్థాయిలోనే వుంది కానీ క‌థ‌, క‌థ‌నాల‌పై ద‌ర్శ‌కుడు ప‌ద్మ‌శ్రీ మ‌రింత‌గా వ‌ర్క్ చేస్తే బాగుండేది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts