Homeటాప్ స్టోరీస్సెప్టెంబర్ 7న ఐదు సినిమాలు రిలీజ్

సెప్టెంబర్ 7న ఐదు సినిమాలు రిలీజ్

september 7th release moviesసెప్టెంబర్ 7న ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సినిమాలు విడుదల అవుతున్నాయి . కేరాఫ్ కంచరపాలెం , మను , ఈ మాయ పేరేమిటో , సిల్లీ ఫెల్లోస్ , ప్రేమకు రెయిన్ చెక్ చిత్రాలు సెప్టెంబర్ 7న విడుదల అవుతున్నాయి . ఇందులో కేరాఫ్ కంచరపాలెం చిత్రానికి ప్రశంసలు లభించాయి , ఈ చిత్రాన్ని చూసిన రానా తన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విడుదల చేస్తున్నాడు అలాగే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకోవడమే కాకుండా తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నాడు కూడా . ఇక ఈ సినిమా తర్వాత అల్లరి నరేష్ – సునీల్ కలిసి నటించిన సిల్లీ ఫెల్లోస్ పై కూడా అంచనాలు ఉన్నాయి .

అల్లరి నరేష్ కు సునీల్ కు గతకొంత కాలంగా హిట్స్ లేవు వాళ్ళిద్దరికీ భీమనేని శ్రీనివాసరావు తోడయ్యాడు కాబట్టి సిల్లీ ఫెల్లోస్ పై కాస్త అంచనాలున్నాయి అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి . ఆ తర్వాత విజయం కోసం తహతహలాడుతున్న బ్రహ్మానందం తనయుడు గౌతమ్ నటించిన ” మను ” కూడా వస్తోంది . వీటితో పాటు ఈ మాయ పేరేమిటో , ప్రేమకు రెయిన్ చెక్ చిత్రాలు కూడా వస్తున్నాయి . అయితే వీటితో పాటుగా మరికొన్ని చిత్రాలు కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే వీటిలో ఏది హిట్ అవుతుందో ఎన్ని ఫ్లాప్ అవుతాయో ?

- Advertisement -

English Title: september 7th release movies

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All